Krishna Kowshik
తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సలార్ సినిమా క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అదే క్రిస్మస్ కి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ కూడా విడుదల అవ్వబోతుంది. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడాలి.
తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సలార్ సినిమా క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అదే క్రిస్మస్ కి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ కూడా విడుదల అవ్వబోతుంది. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడాలి.
Krishna Kowshik
మిర్చి సినిమా వరకు కూడా టైర్ 2 హీరోల జాబితాలో ఉన్న ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా మారి పోయాడు. టాలీవుడ్ లోని స్టార్స్, సూపర్ స్టార్స్ ని కూడా క్రాస్ చేస్తూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూడు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ప్రభాస్ స్టార్ డమ్ కి ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు. ఇప్పటికి ఆయన సినిమా వస్తుంది అంటే పాన్ ఇండియా బాక్సాఫీస్ ఓపెనింగ్ కలెక్షన్స్ తో కలకలలాడటం కన్ఫర్మ్ అన్నట్లుగా సినీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ మాట్లాడుకుంటున్నాయి. అంతటి ఇమేజ్ దక్కించుకున్న ప్రభాస్‌కి మరియు ఆయన స్టామినాకి అసలైన పరీక్ష డుంకీ రూపంలో ఎదురు కాబోతుంది. ఈ పరీక్షలో ప్రభాస్‌కి ఎలాంటి ఫలితం దక్కుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సలార్ సినిమ కి విపరీతమైన పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు సినిమా ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక షారుఖ్ గత రెండు సినిమాలు అయిన పఠాన్, జవాన్ సినిమాలు వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో డుంకీ కూడా ఖచ్చితంగా వెయ్యి కోట్ల సినిమా అంటూ మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. డుంకీ కనుక బాలీవుడ్ లో సత్తా చాటితే కచ్చితంగా సలార్ కి గడ్డు పరిస్థితులు ఎదురవ్వడం ఖాయం. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ దక్కితే అప్పుడు ప్రభాస్ స్టామినా ఏంటో అర్థం అవుతుందని సినీ విశ్లేషకులు మరియు మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
డుంకీ సినిమాకు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించాడు. ఆ సినిమా సినిమాలంటే బాలీవుడ్ ప్రేక్షకులు చాలా స్పెషల్ గా చూస్తారు. ఆయన సినిమాల్లో మ్యాటర్ ఉంటుంది అనే విశ్వాసంను కలిగి ఉంటారు. అలాంటి సినిమా వచ్చిన సమయంలో దాన్ని దాటుకుని సలార్ కి వస్తారా అంటే డౌటే. అయితే వచ్చే టాక్ ని బట్టి వసూళ్లు ఉండే అవకాశం ఉంది. డుంకీ సినిమాకు నెగటివ్ టాక్ వస్తే సలార్ సినిమాను ఆపే వాళ్లే ఉండరు. కానీ సలార్ తో పాటు డుంకీ కి కూడా హిట్ టాక్ వస్తే కచ్చితంగా కలెక్షన్స్ విషయంలో అసలైన వార్ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ సమయంలో అసలైన పాన్ ఇండియా స్టార్ ఎవరు, అసలైన బాలీవుడ్ బాద్ షా ఎవరు అనే విషయమై క్లారిటీ వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాద్ షా పై మన రెబల్ స్టార్ పై చేయి సాధిస్తాడని మీరు భావిస్తున్నారా? కామెంట్ల రూపంలో తెలియజేయండి.