iDreamPost
android-app
ios-app

RC 16.. ‘రంగస్థలం’ సెంటిమెంట్! బుచ్చిబాబు గట్టిగా కొట్టబోతున్నాడా?

  • Published Aug 01, 2024 | 3:06 PM Updated Updated Aug 01, 2024 | 3:06 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో RC 16 అనే మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రంగస్థలం హిట్ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందా? అంటే అవుననే అంటున్నారు. ఈసారి బుచ్చిబాబు గట్టిగా కొట్టబోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో RC 16 అనే మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రంగస్థలం హిట్ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందా? అంటే అవుననే అంటున్నారు. ఈసారి బుచ్చిబాబు గట్టిగా కొట్టబోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 01, 2024 | 3:06 PMUpdated Aug 01, 2024 | 3:06 PM
RC 16.. ‘రంగస్థలం’ సెంటిమెంట్! బుచ్చిబాబు గట్టిగా కొట్టబోతున్నాడా?

డైరెక్టర్ బుచ్చిబాబు.. సుకుమార్ శిష్యుడిగా ‘ఉప్పెన’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక తన తొలి మూవీతోనే హిట్ కొట్టి, పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇక ఇప్పుడు తన రెండో మూవీతోనే ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్నాడు. RC 16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రంగస్థలం హిట్ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందా? అంటే అవుననే అంటున్నారు సినీ పండితులు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ను పూర్తి చేసుకుని, బుచ్చిబాబు సినిమాకు సిద్ధం అవుతున్నాడు. RC 16 మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఎమోషన్స్, ఎలివేషన్స్ ఉండబోతున్నాయట. ఇక ఇందులో రామ్ చరణ్ ఫుల్ గడ్డంతో, రఫ్ అండ్ రియలిస్టిక్ లుక్ లో కనిపించనున్నాడట. అంటే ఇంచు మించు ‘రంగస్థలం’ మూవీలోలాగ. రఫ్ లుక్ లో రామ్ చరణ్ కనిపించిన రంగస్థలం ఏ రేంజ్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు అలాంటి కథతోనే వస్తున్న బుచ్చిబాబు కూడా ఈ లుక్ లోనే చరణ్ ను ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. దాంతో  హిట్ సినిమా రిపీట్ అవుతుంది అంటూ మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ మూవీతో బుచ్చిబాబు గట్టిగా హిట్ కొట్టబోతున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పటికే చరణ్ ఈ క్యారెక్టర్ లోకి మేకోవర్ అవుతున్నాడు. కాగా.. పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కన్న మూవీ కావడంతో.. అప్పటి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రత్యేక సెట్ కూడా వేశారట. దీంతో పాటుగా ఉత్తరాంధ్రలో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారని సమాచారం. ఇక ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ చరణ్ ను ఢీ కొట్టడానికి బలమైన విలన్ కోసం వెతుకులాటలో ఉన్నాడు బుచ్చిబాబు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet