iDreamPost
android-app
ios-app

రజాకార్ డైరెక్టర్ పై నిర్మాత కామెంట్స్.. 16 కోట్లు చెప్పి 50 కోట్లు చేశాడంటూ!

Razakar Movie: ఈ వారం టాలీవుడ్ లో 15 సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో అందరూ రజాకార్ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా నిర్మాత కీలక వ్యాఖ్యలు చేశారు.

Razakar Movie: ఈ వారం టాలీవుడ్ లో 15 సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో అందరూ రజాకార్ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా నిర్మాత కీలక వ్యాఖ్యలు చేశారు.

రజాకార్ డైరెక్టర్ పై నిర్మాత కామెంట్స్.. 16 కోట్లు చెప్పి 50 కోట్లు చేశాడంటూ!

ఈవారం థియేటర్లలో చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఈ వారం దాదాపు 15 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో ప్రముఖంగా వినిపిస్తున్న సినిమా పేరు రజాకార్. ఇప్పుడు రిలీజ్ కానున్న చిత్రాల్లో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అలాగే బజ్ కూడా ఏర్పడింది. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి నిర్మాత చేసిన వ్యాఖ్యాలు ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. సినిమా ఎలా ఉండబోదోతోంది? అనే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రజాకార్: సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ సినిమాని యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఈ మూవీ మార్చి 15న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాని మొత్తం 6 భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళ్, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో రజాకార్ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో బాబీ సంహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ఇంద్రజ, ప్రేమ, అనసూయ, మకరంద్ దేశ్ పాండే, వంటి వాళ్లంతా ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూవీ చుట్టూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.

Razaakar

ఈ మూవీని 1950ల కాలంలో రజాకారులు హైదరాబాద్ ప్రజలను ఎలా పీడించారు అనే పాయింట్ మీద తెరకెక్కించారు. ఈ సినిమాకి సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా కూడా వివాదాస్పదం అయ్యింది. మొదట అందరూ ఈ చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్ రాదు అనుకున్నారు. కానీ, ఈ మూవీ మార్చి 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ సినిమాపై చాలానే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు నిర్మాత చేసిన వ్యాఖ్యలు ఆ అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. నిర్మాత గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ.. “ఈ రజాకార్ చిత్రానికి దర్శకుడు యాటా సత్యనారాయణే కరెక్ట్. ఈ మూవీని ఆయన బాహుబలి రేంజ్ లో తెరకెక్కించారు. ఈ సినిమాలో చాలా పెద్ద కాస్టింగ్ ఉంది.

రజాకార్ సినిమా విజువల్స్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ మూవీకి మంచి అసెట్ అవుతారు. సాంగ్స్ ని కూడా చాలా పెద్ద సింగర్స్ పాడించారు. టెక్నికల్ గా ఈ చిత్రం ఎంతో రిచ్ గా, వావ్ అనిపించేలా ఉంటుంది. ఈ చిత్రానికి యాటా సత్యనారాయణ మొదట చెప్పిన బడ్జెట్ రూ.16 కోట్లు. కానీ, ఆ బడ్జెట్ పెరుగుతూ వచ్చింది. అది చివరకు రూ.50 కోట్లకు చేరింది” అంటూ నిర్మాత గూడూరు నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సినిమా మూవీ లవర్స్ అందరికీ తెగ నచ్చేస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రజాకార్ చిత్రానికి సంబంధించి అనసూయ యాక్టింగ్ కి కూడా మంచి అప్లాజ్ లభిస్తోంది. ఆమె నటన ఇందులో నెక్ట్స్ లెవల్లో ఉంటుందని చెబుతున్నారు. మరి.. రజాకార్ చిత్రం ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.