iDreamPost
android-app
ios-app

RaviTeja వాయిదా పడిన రామారావు – ఏం జరిగింది

  • Published May 26, 2022 | 4:45 PM Updated Updated May 26, 2022 | 4:45 PM
  • Published May 26, 2022 | 4:45 PMUpdated May 26, 2022 | 4:45 PM
RaviTeja వాయిదా పడిన రామారావు – ఏం జరిగింది

ముందు ప్రకటించిన జూన్ 17 విడుదల నుంచి రామారావు ఆన్ డ్యూటీ తప్పుకున్నాడు. ఆ రోజు రిలీజ్ చేయడం లేదని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా దివ్యంషు కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ కు శరత్ మండవ దర్శకులు. ప్రారంభానికి ముందు ఈ ప్రాజెక్టు పట్ల మంచి ఎగ్జైట్ మెంట్ చూపించిన రవితేజ అంతే వేగంగా పూర్తి చేయడంతో ఉత్సాహం కనబరిచారు. అంతా సవ్యంగా జరుగుతోందని అనుకుంటున్న టైంలో ఇలా పోస్ట్ పోన్ షాక్ ఇవ్వడం అభిమానులు ఊహించనిది. తిరిగి కొత్త డేట్ ఎప్పుడనేది ప్రకటనలో పేర్కొనలేదు కాబట్టి కొంత ఆలస్యం ఉండొచ్చు

నిజానికి ఇలా లేట్ కావడం వెనుక వేరే కారణాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. రెమ్యునరేషన్ చెల్లించే విషయంలో ఏవో విబేధాలు రావడంతో పాటు ఒక పాట చిత్రీకరణ అలాగే పెండింగ్ లో ఉండిపోవడంతో తప్పని పరిస్థితిలో వాయిదా వేశారట. ఇది అధికారికంగా చెప్పింది కాదు కానీ ఫిలిం నగర్ టాక్ అయితే జోరుగా ఉంది. ప్రొడక్షన్ టీమ్ మాత్రం సిజి వర్క్ తో పాటు ఇతర పనులను రీజన్స్ గా చూపిస్తోంది. రెవిన్యూ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ ఖిలాడీ లాంటి ఆల్ టైం డిజాస్టర్ తర్వాత వస్తుండటంతో అభిమానులు దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. గ్యారెంటీ హిట్ అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సరే దీని సంగతి కాసేపు పక్కనపెడితే రవితేజ ప్రస్తుతం ధమాకాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇదయ్యాక రావణాసుర ఉంటుంది. మధ్యలో చిరంజీవి కాంబినేషన్ లో చేయాల్సిన వాల్తేర్ వీరయ్యకు డేట్లు సర్దాల్సి ఉంటుంది. ఇవి కాకుండా మరో తమిళ దర్శకుడు చర్చల్లో ఉన్నాడు. కథ ఒకే అయితే దానికి సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే వస్తుంది. నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న రవితేజ ఏ హీరోతో పోల్చినా వాళ్లకు అందనంత స్పీడ్ లో వెళ్తున్నాడు. ఈ దూకుడు వల్లే గత కొన్నేళ్లుగా హిట్ల కంటే ఫ్లాపులు ఎక్కువ వస్తున్నాయి. క్రాక్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన కిక్ కంటిన్యూ అవ్వాలంటే రామారావు ఆన్ డ్యూటీతో మళ్ళీ హిట్టు కొట్టాలి

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom