iDreamPost
android-app
ios-app

Mr. Bachchan Censor Review: మిస్టర్ బచ్చన్ సెన్సార్ రివ్యూ! మాస్ మహారాజా యాక్షన్ ధమాకా..

  • Published Aug 08, 2024 | 2:56 PM Updated Updated Aug 09, 2024 | 3:19 PM

రవితేజ మిస్టర్ బచ్చన్ సెన్సార్ ను పూర్తి చేసుకుంది. బోర్డ్ సభ్యులు సినిమా చూసి ఎలాంటి రివ్యూ ఇచ్చారు? ఏ సర్టిఫికెట్ ఇచ్చారో తెలుసుకుందాం పదండి.

రవితేజ మిస్టర్ బచ్చన్ సెన్సార్ ను పూర్తి చేసుకుంది. బోర్డ్ సభ్యులు సినిమా చూసి ఎలాంటి రివ్యూ ఇచ్చారు? ఏ సర్టిఫికెట్ ఇచ్చారో తెలుసుకుందాం పదండి.

Mr. Bachchan Censor Review: మిస్టర్ బచ్చన్ సెన్సార్ రివ్యూ! మాస్ మహారాజా యాక్షన్ ధమాకా..

మిస్టర్ బచ్చన్.. మాస్ మహారాజా రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన సినిమా. ఇందులో రవితేజకు జోడీగా అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పాటల్లో ముఖ్యంగా భాగ్యశ్రీ బోర్సే అందాలు అభిమానులను మెస్మరైజ్ చేశాయని చెప్పుకోవాలి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ మాస్ ఆడియెన్స్ ను పిచ్చెక్కిస్తోంది. రవితేజను ఏ రేంజ్ లో వాడుకోవాలో.. ఆ రేంజ్ లో వాడాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ట్రైలర్ చూస్తుంటే.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఖాయం అనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. మిస్టర్ బచ్చన్ సెన్సార్ ను పూర్తి చేసుకుంది. బోర్డ్ సభ్యులు సినిమా చూసి ఎలాంటి రివ్యూ ఇచ్చారో చూద్దాం పదండి.

మాస్ మహారాజా రవితేజ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే. అన్ని రకాల ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసే ఎలిమెంట్స్ తన సినిమాలో ఉండే విధంగా చూసుకుంటాడు ఈ సీనియర్ హీరో. అందుకే అతడంటే అందరికి అభిమానం. ఇక ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ఆగస్ట్ 15న ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో టీమ్ ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో సెన్సార్ రివ్యూ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఈ మూవీ చూసి సెన్సార్ బోర్డ్ సభ్యులు ఏమన్నారంటే?

mr. bachchan sensor review 2

రవితేజను వింటేజ్ లుక్ లో చూపించడం కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుందని ప్రశంసించారు. ఇక సినిమా అద్భుతంగా ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంది. యాక్షన్ సన్నివేశాలు మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయని తెలిపారు. దాంతో పాటుగా భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ సినిమాకు ప్లస్ కాబోతుందని, ఈ మూవీ తర్వాత ఆమెకు అవకాశాలు క్యూ కడతాయని పేర్కొంది. చివరి 45 నిమిషాలు సినిమాకు కీలకం అని.. మెుత్తానికి మిస్టర్ బచ్చన్ మాస్ మహారాజా యాక్షన్ ధమాకా అని రివ్యూ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఇక ఈ మూవీలో కాస్త యాక్షన్, గ్లామర్ ఎక్కువ ఉండటంతో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఇక రన్ టైమ్ 2 గంటల 38  నిమిషాలకు లాక్ చేశారట. సెన్సార్ టాక్ ను బట్టి చూసుకుంటే ఇటు రవితేజ, అటు హరీష్ శంకర్ హిట్ కొట్టబోతున్నారన్నమాట.