iDreamPost
android-app
ios-app

Eagle: ఈగల్ మేకర్స్ డేరింగ్ స్టెప్..హిట్ పక్కా అని ఫిక్స్ అయ్యారా?

  • Published Feb 06, 2024 | 5:53 PM Updated Updated Feb 06, 2024 | 5:53 PM

రవి తేజ హీరోగా తాజాగా నటించిన చిత్రం "ఈగల్" . ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈ మూవీ గురించి ఎన్నో వార్తలను వింటూనే వస్తున్నాం. అయితే, ఇప్పుడు తాజాగా మరో డేరింగ్ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.

రవి తేజ హీరోగా తాజాగా నటించిన చిత్రం "ఈగల్" . ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈ మూవీ గురించి ఎన్నో వార్తలను వింటూనే వస్తున్నాం. అయితే, ఇప్పుడు తాజాగా మరో డేరింగ్ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.

  • Published Feb 06, 2024 | 5:53 PMUpdated Feb 06, 2024 | 5:53 PM
Eagle: ఈగల్ మేకర్స్ డేరింగ్ స్టెప్..హిట్ పక్కా అని ఫిక్స్ అయ్యారా?

మరో మూడు రోజుల్లో మాస్ మహారాజ్ రవితేజ నటించిన “ఈగల్” సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలానే, అవసరాల శ్రీనివాస్, నవదీప్, మధుబాల ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఇప్పటికే సినిమాకు సంబందించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో అంతటా పాజిటివ్ టాక్ సంపాదించుకోగా .. తాజాగా మూవీ మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం చిత్ర బృందం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఒకటొకటిగా అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. అలానే , ఇప్పుడు మరో డేరింగ్ అప్ డేట్ ప్రకటించింది చిత్ర బృందం. అదేంటో తెలుసుకుందాం.

సాధారణంగా పెద్ద సినిమాలకు పేరుకు తగినట్టే.. టికెట్ ధరలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. మొదటి రోజున టికెట్స్ సంపాదించడం అంటే చాలా కష్టం. అలాగే సినిమా బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుని.. టికెట్ రేట్లను పెంచేస్తూ ఉంటారు. ఇలా టికెట్ ధరలను పెంచేందుకు ప్రభుత్వాలు సైతం.. టికెట్ ధరలు పెంచేందుకు అవకాశం ఇస్తుంది. కాబట్టి ఎవరైన సరే వారి సినిమా టికెట్ ధరలను పెంచేందుకు చూస్తుంటారు. కానీ , ఈగల్ మూవీ టీమ్ మాత్రం వారి టికెట్లను మామూలు రోజుల్లో ఉండే ధరలకే అందుబాటులో ఉండేలా చూస్తోంది. సాధారణంగా హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో ఉండే టికెట్ ధర రూ. 200, సింగల్ స్క్రీన్ థియేటర్ రూ. 150. ఇంకా అత్యధికంగా అయితే మల్టీప్లెక్స్ లో టికెట్ ధర రూ. 295 వరకు పెంచుకునే అవకాశం ఉంది. కానీ, ఈగల్ మూవీ టీమ్ మాత్రం వారి సినిమా టికెట్ ధరలను సాధారణ రోజుల్లో ఉండే ధరలకే అందేలా చూస్తోంది.

అయితే, ఈగల్ సినిమాను ఎక్కువమంది చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. మల్టీప్లెక్స్ లో ఈగల్ మూవీ టికెట్ ధర కేవలం రూ.200 చూపిస్తోంది. అయితే ఫిబ్రవరి, మార్చి నెలలు కావడంతో .. చాలా మంది స్టూడెంట్స్ సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఏదేమైనా మూవీ టీమ్ కు సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకం కారణంగానే .. ఈ డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈగల్ చిత్రం కోసం .. ప్రేక్షకులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి, ఈగల్ మూవీ మేకర్స్ టికెట్ ధరల విషయంలో తీసుకున్న డేరింగ్ స్టెప్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.