iDreamPost
android-app
ios-app

విక్రమార్కుడులో రవితేజను కుమ్మేసిన ఈ నటి గుర్తుందా.? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే

  • Published Aug 14, 2024 | 7:15 PM Updated Updated Aug 14, 2024 | 7:35 PM

Vikramarkudu Fame Jayavani: దర్శక ధీరుడు రాజమౌళి, మాస్ మహరాజా రవితేజ కాంబినేషణ్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో రవితేజతో జుట్టులు పట్టుకుని మరీ కొట్టుకున్న ఈ నటి గుర్తుందా.. ఈమె ఇప్పుడు ఎంతాలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Vikramarkudu Fame Jayavani: దర్శక ధీరుడు రాజమౌళి, మాస్ మహరాజా రవితేజ కాంబినేషణ్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో రవితేజతో జుట్టులు పట్టుకుని మరీ కొట్టుకున్న ఈ నటి గుర్తుందా.. ఈమె ఇప్పుడు ఎంతాలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Aug 14, 2024 | 7:15 PMUpdated Aug 14, 2024 | 7:35 PM
విక్రమార్కుడులో రవితేజను కుమ్మేసిన ఈ నటి గుర్తుందా.? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఆయన తీసిని సినిమాలన్ని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడమే కాకుండా..  రికార్డులు సృష్టిస్తుంటాయి.  అంతలా సినిమాలో కంటెంట్ ను సరికొత్తగా క్రియేటివిటితో తెరకెక్కిస్తారు రాజామౌళి. మరీ అలా డిఫరెంట్ కాన్సెఫ్ట్ లతో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాల్లో విక్రమార్కుడు కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించారు. అలాగే ఇందులో అనుష్క హీరోయిన్ గా నటించింది. ఇక అప్పటిలో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పైగా విక్రమార్కుడు రిరీలిజ్ అయినప్పుడు కూడా ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఇకపోతే ఈ సినిమాలో రవితేజ విక్రమ రాథోడ్ అనే ఫవర్ ఫుల్ క్యారెక్టర్ తో పాటు అత్తిలి సత్తిబాబు అనే పాత్రలో కూడా నటించి అదరగొట్టారు. అయితే ఈ అత్తిలి సత్తిబాబు సినిమాలో రవితేజకు  నటనకు, కామోడీకు ఆడియోన్స్ తెగ ఎంజాయ్ చేశారనే చెప్పవచ్చు. అయితే విక్రమార్కుడు సినిమాలో రవితేజతో ఓ లేడి గ్యాంగ్ గొడవకు దిగే సన్నివేశం ఉంటుంది. కాగా, ఆ సన్నివేశంలో రవితేజతో జుట్టులు పట్టుకుని మరీ కొట్టుకున్న ఈ నటి గుర్తుందా.. ఈమె ఇప్పుడు ఎంతాలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

విక్రమార్కుడు సినిమాలో పిల్లల తల్లులిగా వచ్చి రవితేజతో పెద్ద గొడవే పెట్టుకున్న ఈ నటి పేరు ‘జయవాణి’. ఈమె విక్రమార్కుడు సినిమాలో నటించి మంచి క్రేజ్ ను దక్కించుకుంది. అయితే ఈ సినిమాకు ముందు జయవాణి తెలుగులో  ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.  కానీ, చాలా రోజుల నుంచి ఈమె ఏ సినిమాలో కనిపించడం లేదనే విషయం తెలిసిందే.  అయితే తాజాగా ఈ నటికి  సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. కాగా, ఆ వీడియోలో రవితేజ గురించి జయవాణి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Angi Laagu (@angi_laagu)

ఈ సందర్భంగా జయవాణి మాట్లాడుతూ.. ‘విక్కమార్కుడు షూటింగ్ జరుగుతున్న సమయంలో రవితేజ వచ్చి ఇక్కడ జయవాణి ఎవరు అని అడిగారు. అప్పుడు నేనే సార్ అని చెప్పాను. ఇక అప్పుడు రవితేజ గారు అమ్మ ఈ సినిమాలో నీది చాలా మంచి సీన్. నాకు చాలా  బాగా నచ్చింది.  అలాగే మీరు ఈ సీన్ లో న్నను కొట్టండి నేను కొడతా.. మీరు జుట్టుపట్టుకోండి.. నేనే జుట్టు పట్టుకుంటా.. మీరు ఏమీ ఫీల్ అవ్వొద్దు అంటూ నాకు భరోసా ఇచ్చారు. అలా రవితేజ గారు నాకు చెప్పిన తర్వాత నును చాాలా రిలీఫ్ అయ్యాను. ఎందుకంటే.. హీరో ఇలా నన్ను కొట్టండి అని చెప్పడం మాములు విషయం కాదు. ఇక సీన్ లోకి వెళ్లిన తర్వాత.. నిజంగానే ఆయన నా జుట్టు పట్టుకోవడం, నేను ఆయన జుట్టును పట్టుకొని కొట్టుకున్నట్లు నటించం’ అంటూ జయవాణి విక్రమార్కుడు సినిమాలో రవితేజతో జరిగిన సన్నివేశం గురించి చెప్పుకొచ్చింది. ఇకపోతే సినిమాల్లోనే కాకుండా..  జయవాణి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన   వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జయవాణి అప్పటికన్నా ఇప్పుడు చాలా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ, ప్రస్తుతం నటి జయవాణి లేటెస్ట్ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by SKMEDIA (@skmedia_reels)