Keerthi
Mr Bachchan: డైరెక్టర్ హరీశ్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో మిస్టర్ బచ్చన్ మూవీకి దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి. అయితే వీకెండ్ ఎండ్ కారణంగా.. మిస్టర్ బచ్చన్ డే4 కలెక్షన్స్ ఎలా ఉన్నయో తెలుసుకుందాం.
Mr Bachchan: డైరెక్టర్ హరీశ్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో మిస్టర్ బచ్చన్ మూవీకి దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి. అయితే వీకెండ్ ఎండ్ కారణంగా.. మిస్టర్ బచ్చన్ డే4 కలెక్షన్స్ ఎలా ఉన్నయో తెలుసుకుందాం.
Keerthi
మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. కాగా, ఈ సినిమాకు డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇకపోతే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా చిత్రంగా రూపొందించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలకు ముందు టీజర్, పోస్టర్,సాంగ్స్, ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై ఇటు ప్రేక్షకులతో పాటు రవితేజ ఫ్యాన్స్ కు కూడాభారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, మిస్టర్ బచ్చన్ థియేటర్ లో విడుదలైన తర్వాత.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు అలరించలేక పోయింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ కు ఈ సినిమా పై నిరాశ తప్పలేదు. అంతేకాకుండా.. ఈ సినిమా కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయాయి. మరీ, మిస్టర్ బచ్చన్ డే 4 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
డైరెక్టర్ హరీశ్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో మిస్టర్ బచ్చన్ మూవీకి దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా వీకెండ్ ముగిసిన తర్వాత.. మిస్టర్ బచ్చన్ డే4 కలెక్షన్స్ చాలా దారుణంగా పడిపోయాయి. ఎందుకంటే.. ఈ మూవీ రెండవ రోజు వరల్డ్ వైడ్ గా రూ. 1.75 కోట్లు రాబట్టగా.. మూడవ రోజు కలెక్షన్స్ మరింత దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా నైజాంలో రూ. 11.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 11.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.00 కోట్లు వ్యాపారం అయింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 31.00 కోట్లు బిజినెస్ చేసింది.
ముఖ్యంగా సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఈ సినిమా 4వ రోజు బాగా డౌన్ అయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 55 లక్షలు షేర్ మాత్రమే రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 65 లక్షలు వసూలు చేసింది. ఇలా 4 రోజుల్లో ఈ చిత్రం కేవలం రూ. 7.50 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి నిరాశ పరిచింది. దీంతో మిస్టర్ బచ్చన్ బ్రేక్ ఈవెన్ ను టార్గెట్ కూడా దాటడం కష్టంగానే ఉంది. అసలు ఈ సినిమాకు విడుదలకు ముందు ఉన్నంతా బజ్ ఇప్పుడు లేకపోవడం గమన్హారం. ఇకపోతే మిస్టర్ బచ్చన్ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. మరీ, మిస్టర్ బచ్చన్ డే4 కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.