iDreamPost
android-app
ios-app

Eagle: ఈగల్ ఫస్ట్ రివ్యూ.. రవితేజ ఆనందం చూశారా?

  • Published Feb 06, 2024 | 1:19 PM Updated Updated Feb 06, 2024 | 2:01 PM

తాజాగా రవి తేజ హీరోగా నటించిన చిత్రం "ఈగల్" . ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మూవీ స్పెషల్ ప్రివ్యూను చూశారు చిత్ర బృందం. మూవీ కంప్లీట్ అయిన తర్వాత రవి తేజ మూవీపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తాజాగా రవి తేజ హీరోగా నటించిన చిత్రం "ఈగల్" . ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మూవీ స్పెషల్ ప్రివ్యూను చూశారు చిత్ర బృందం. మూవీ కంప్లీట్ అయిన తర్వాత రవి తేజ మూవీపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

  • Published Feb 06, 2024 | 1:19 PMUpdated Feb 06, 2024 | 2:01 PM
Eagle: ఈగల్ ఫస్ట్ రివ్యూ.. రవితేజ ఆనందం చూశారా?

టాలీవుడ్ లో మాస్ ఎంటర్టైన్మెంట్ ను ప్రేక్షకులకు అందిస్తున్న హీరోలలో మాస్ మహారాజ రవి తేజ ఒకడు. ఆ సినిమా హిట్ అయినా .. ప్లాప్ అయినా సరే .. వాటిని పట్టించుకోకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి.. నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడు రవి తేజ. అందుకే అభిమానుల హృదయాలలో మాస్ మహారాజుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తాజాగా రవి తేజ నటించిన చిత్రం “ఈగల్”. గత నెల సంక్రాంతికి సమయంలోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది . కానీ, కానీ, కొన్ని విషయాల కారణంగా .. సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకుని.. ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మూవీ టీమ్ తాజాగా “ఈగల్” చిత్రాన్ని వీక్షించింది. మూవీ ఎండ్ లో రవి తేజ ఒక్కమాటలో తన రివ్యూను చెప్పేశాడు. దీనితో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఈ వీడియోతో “ఈగల్” సినిమాపై మరింత ఎక్స్పెక్టషన్స్ పెంచేసింది.

మరో మూడు రోజుల్లో మాస్ మహారాజ్ రవితేజ నటించిన “ఈగల్” సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలానే, అవసరాల శ్రీనివాస్, నవదీప్, మధుబాల ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఇప్పటికే సినిమాకు సంబందించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో అంతటా పాజిటివ్ టాక్ సంపాదించుకోగా .. తాజాగా మూవీ మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. తాజాగా విడుదల చేసిన “ఈగల్”మూవీ మేకింగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. దీనితో ప్రస్తుతం అందరికి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అటు సోషల్ మీడియాలోను మూవీ ప్రమోషన్లకు సంబంధించిన వీడియోలు అన్నీ.. వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే అందరూ “ఈగల్” గురించి ఈగర్ గా వెయిట్ చేస్తుంటే .. తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో ఇంకాస్త ఆసక్తిని నెలకొల్పుతోంది.

“ఈగల్” సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో .. మూవీ టీమ్ అంతా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం అంతా కలిసి సినిమా స్పెషల్ ప్రివ్యూ ని చూశారు. తన సినిమాను చూసుకుని రవితేజ చాలా సంతోషించారు. “ఐ యామ్ ఫుల్ శాటిస్ఫైడ్” అంటూ ఒక్క మాటలో “ఈగల్” సినిమా రివ్యూ ఇచ్చేశారు. అక్కడున్న దర్శకుడు, నిర్మాతలు , మిగిలిన వారు కూడా హ్యాపీగానే కనిపిస్తున్నారు. ఇక స్వయంగా రవితేజ రివ్యూ చెప్పిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనితో సామాజిక మాధ్యమాలలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. ఇక , థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత “ఈగల్” ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet