iDreamPost
android-app
ios-app

మాస్ రాజాకి అచ్చి రాని ప్రొడక్షన్

  • Published Feb 24, 2024 | 2:18 PM Updated Updated Feb 24, 2024 | 2:18 PM

మాస్ మహారాజ్ రవితేజ.. ఈగల్ మూవీతో పలకరించాడు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ మూవీ ఓకే అనిపించుకుంది. అయితే.. ఆయన నిర్మాతగా మారి.. ఆ మూవీకి డబ్బులు పెట్టాడు..

మాస్ మహారాజ్ రవితేజ.. ఈగల్ మూవీతో పలకరించాడు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ మూవీ ఓకే అనిపించుకుంది. అయితే.. ఆయన నిర్మాతగా మారి.. ఆ మూవీకి డబ్బులు పెట్టాడు..

  • Published Feb 24, 2024 | 2:18 PMUpdated Feb 24, 2024 | 2:18 PM
మాస్ రాజాకి అచ్చి రాని ప్రొడక్షన్

మాస్ రాజా… మాస్ మహారాజా అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే రవితేజ గురించి ఇటీవల ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో రవితేజ అద్భుతంగా నటించి శభాష్ అనిపించుకున్నా… బాక్సాఫీస్ వద్ద సినిమా మాత్రం అంతంత మాత్రంగానే ఆడింది. ఇదిలా ఉంటే హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఒక కొత్త సినిమా విడుదల చేశారు. ఆ సినిమానే సుందరం మాస్టర్. అయితే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీంతో రవితేజకి ప్రొడక్షన్ అచ్చి రాదా అనే అనుమానం అందరిలోనూ మొదలైంది.

మెగాస్టార్ చిరంజీవి తరువాత ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో అయిన రవితేజ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. హీరోగా ఎంతో మంది కొత్త దర్శకుల్ని పరిచయం చేసిన ఆయన కొన్నేళ్ల ముందు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి మరో అడుగు ముందుకేసారు. అయితే నిర్మాతగా రవితేజకు వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి. తొలుత ‘ రామారావు అన్ డ్యూటీ ‘ సినిమాతో నిర్మాతగా తన ప్రయాణం మొదలు పెట్టారు రవితేజ. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తరువాత ‘గట్ట కుస్తీ’ (మట్టీ కుస్తీ) అనే తమిళ – తెలుగు డబ్బింగ్ సినిమా చేయగా కంటెంట్ బాగున్నప్పటికీ ఆ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు.

ఆ తర్వాత తనే హీరోగా తీసిన ‘రావణాసుర’కి నిర్మాణ భాగస్వామ్యం చేశారు. ఆ సినిమాతో పాటు గతేడాది ‘చాంగురే బంగారు రాజా’ అనే చిన్న సినిమా కూడా రవితేజ నిర్మించారు. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. తాజాగా కమెడియన్ హర్ష చెముడుని హీరోగా పెట్టి ‘సుందరం మాస్టారు’ అనే సినిమా తీశారు. ఫిబ్రవరి 23మా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి అంతగా టాక్ రాలేదు. నిజానికి రవితేజ నిర్మాతగా చేసిన అన్ని సినిమాల్లో కాన్సెప్ట్ ఉన్నప్పటికీ… అనుకున్నది సరిగ్గా తెరకెక్కించడంలో మాత్రం దర్శకులు తడబడ్డారు. నిర్మాతగా నూతన దర్శకులని, కొత్త కథలని ప్రోత్సహించాలి అనే రవితేజ ఉద్దేశ్యం ఫలించి తదుపరి సినిమాతో అయినా మంచి విజయం సాధించాలి అని కోరుకుందాం.