Nagendra Kumar
Eagle Movie Team Request Letter: ఈ ఏడాది సంక్రాంతి కానుకగా పెద్ద హీరోల సినిమాలు ధియేటర్లలో సందడి చేశాయి. అయితే రవితేజ నటించిన ‘ఈగల్’ మూవీ కూడా రిలీజ్ కావాల్సి ఉన్నా.. చిత్ర యూనిట్ డేట్ పోస్ట్ పోన్ చేసుకున్నారు.
Eagle Movie Team Request Letter: ఈ ఏడాది సంక్రాంతి కానుకగా పెద్ద హీరోల సినిమాలు ధియేటర్లలో సందడి చేశాయి. అయితే రవితేజ నటించిన ‘ఈగల్’ మూవీ కూడా రిలీజ్ కావాల్సి ఉన్నా.. చిత్ర యూనిట్ డేట్ పోస్ట్ పోన్ చేసుకున్నారు.
Nagendra Kumar
సంక్రాంతి సినిమాల విడుదల ఒత్తిడిలో ఎవరు ఆగి, వేరే డేట్ ఆప్ రిలీజ్ కి ఒప్పుకుంటారా అన్నది దాదాపుగా ఆరునెలల పాటు ఎడతెరిపి లేకుండా కొనసాగింది. కానీ రిలీజ్ విషయంలో ఎవ్వరూ తగ్గలేదు. ఎవరికి వారే సంక్రాంతిని మిస్ కావడానికి మొగ్గు చూపలేదు. పోస్ట్ పోన్ కోసం విశ్వప్రయత్నం జరిగింది. అప్పుడు అందరి అభ్యర్ధనలను పరిగణించి, హీరో రవితేజతో కూడా పర్సనల్ గా డిస్కస్ చేసి, ఆయన అంగీకారంతో ‘ఈగల్’ సినిమాని సంక్రాంతి బరిలోనుంచి తప్పించి, ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి చిత్ర నిర్మాత, పీపుల్స్ మీడియా అధినేత టిజి విశ్వప్రసాద్ స్వచ్ఛందంగా సమ్మతించారు. అప్పుడు నిర్ణయం ప్రకారం ఎవరు సహకరించి, వేరే డేట్ ఆప్ రిలీజ్ ని ఎంపిక చేసుకుంటారో ఫిబ్రవరిలో సోలో రిలీజ్ డేట్ ఇవ్వడానికి ఛాంబర్ హామీ ఇచ్చింది.
ఈగల్ కోసం చేద్దామనుకున్న పబ్లిసిటీ ప్రోగ్రామ్ ని కూడా విశ్వప్రసాద్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరేగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 8న యాత్ర 2 విడుదలకు సన్నాహాలు చేస్తుండగా, దానితో పాటు ఊరి పేరు భైరవకోన కూడా విడుదలకు ముస్తాబైపోతోంది. మర్నాడు అంటే ఫిబ్రవరి 9న రజనీకాంత్ లాల్ సలామ్ డేట్ ఫిక్స్ అయింది. అందరికీ మళ్ళీ అదే పాయంట్ ఆఫ్ టైం కావాల్సిన అగత్యం వచ్చేసింది. ఛాంబర్ కూడా పెద్దగా దీనిమీద స్పందించలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఈగల్ సినిమాకి సోలో డేట్ దక్కనిచ్చేటట్టు లేదు. అందుకే పీపుల్స్ మీడియా తరుఫున నిర్మాత టిజి వివ్వప్రసాద్ ఛాంబర్ కి ఒక లేఖ రాయాల్సి వచ్చింది.
లేఖలో ఛాంబర్ ప్రయత్నాన్ని గౌరవిస్తూ తాము రిలీజ్ డేట్ మార్చుకున్నామని, ఆరోజున మీడియా ముందే తమకు ఫిబ్రవరి 9న సోలో డేట్ ఇస్తామని భరోసా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నామని ఉంది. ఈ నేపథ్యంలో ఛాంబర్ జోక్యం చేసుకుని ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ కల్పించేందుకు ప్రోగ్రాం చేయాలని విశ్వప్రసాద్ రాశారు. చాంబర్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీకి ఈ లెటర్ ద్వారా విశ్వప్రసాద్ పై విషయాన్ని తెలియజేశారు.