Nagendra Kumar
Eagle Postponed: సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాల విషయంలో కొంత సగ్దిత నెెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ పోరు నుంచి రవితేజ ఈగల్ చిత్రం అధికారికంగా తప్పుకొంది.
Eagle Postponed: సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాల విషయంలో కొంత సగ్దిత నెెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ పోరు నుంచి రవితేజ ఈగల్ చిత్రం అధికారికంగా తప్పుకొంది.
Nagendra Kumar
చాలా రోజులుగా ఈగల్ రిలీజ్ డేట్ విషయమై చాలా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. కానీ ఎంతకీ కొలిక్కిరాని చర్చలతో రిలీజ్ డేట్ సందిగ్ధంలో పడుతూనే వచ్చింది. కానీ ముందుగా ప్రకటించిన డేట్ దగ్గరవుతోందనగా ఒత్తిడి తారాస్థాయికి చేరుకుంది. ఏ సినిమాకి ఆ సినిమాయే ప్రధానం అన్నట్టుగా ఎవ్వరూ తగ్గలేదు. ఈగల్ చిత్ర నిర్మాత, పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ మాత్రం ఎక్కడా సడలకుండా తాను ముందు ప్రకటించిన డేట్ మీదనే నిలబడ్డారు.
కానీ, ఎఫ్పుడైతే దిల్ రాజు గుంటూరు కారం సినిమాకి దాదాపుగా 90 స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో కొంత ఉక్కిరిబిక్కిరి మొదలైంది. చివిరి క్షణం వరకూ కూడా హీరో రవితేజ నిర్ణయాన్నే గౌరవిస్తూ, రవితేజని సంప్రదించిన తర్వాతనే విశ్వప్రసాద్ రిలీజ్ డేట్ మార్పు విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ముందుగా అనుకున్న మూడు డేట్స్ లో ఫిబ్రవరి 9వ తేదీనే విడుదల తేదీగా ఎంచుకుని కొంతసేపటి క్రితమే విశ్వప్రసాద్ ప్రకటించారు. ఫిల్మ్ ఛాంబర్ ముఖ్యులతో సమావేశమై అధికారికంగా ఫిబ్రవరి 9వ తేదీనే ఈగల్ రిలీజ్ చేస్తున్నట్టుగా విశ్వప్రసాద్ తెలిపారు. ఇతర సినిమాల విడుదలను గౌరవించి, అందుకు అనువుగా తమ సినిమా డేట్‌ను మార్చుకుని సహకరించినందుకు విశ్వప్రసాద్‌కు దిల్ రాజు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకిప్పుడు సంక్రాంతి పోటీలో గుంటూరు కారం, నా సామిరంగా, హనుమాన్, సైంధవ్ చిత్రాలు మాత్రమే తలపడబోతున్నాయి.