iDreamPost
android-app
ios-app

ఈగల్ డే 2 కలెక్షన్లు.. మాస్ మహారాజా గట్టెక్కేనా?

  • Published Feb 11, 2024 | 12:54 PM Updated Updated Feb 11, 2024 | 3:41 PM

Eagle Movie Day 2 Collections: తొలిరోజు భారీ వసూళ్లను సాధించిన మాస్ మహారాజా రవితేజ.. రెండోరోజు కాస్త తగ్గాడు. మరి ఈగల్ మూవీ 2 రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఎన్నో ఇప్పుడు తెలుసుకుందాం.

Eagle Movie Day 2 Collections: తొలిరోజు భారీ వసూళ్లను సాధించిన మాస్ మహారాజా రవితేజ.. రెండోరోజు కాస్త తగ్గాడు. మరి ఈగల్ మూవీ 2 రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఎన్నో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Feb 11, 2024 | 12:54 PMUpdated Feb 11, 2024 | 3:41 PM
ఈగల్ డే 2 కలెక్షన్లు.. మాస్ మహారాజా గట్టెక్కేనా?

టాలీవుడ్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే.. హీరోల్లో ముందువరుసలో ఉంటాడు మాస్ మహారాజా రవితేజ. తనదైన కామెడీ టైమింగ్ తో నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని ముందుకుసాగుతున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సీనియర్ హీరో ఓ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో వచ్చిన మూవీ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా.. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. మరి రెండు రోజుల్లో రవితేజ ఎన్ని కోట్లు రాబట్టాడో చూద్దాం పదండి.

రవితేజ నటించిన ఈగల్ మూవీకి డీసెంట్ కమ్ మిక్స్ డ్ టాక్ వచ్చింది. కొందరు యాక్షన్ సీన్లు అద్భుతం అంటే.. మరికొందరు హాలీవుడ్ టచ్ ఇద్దానికి ట్రై చేయడం గొప్ప విషయం అంటూ పొగుడుతున్నారు. ఇక ఈ చిత్రం తొలిరోజు భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. ఫస్ట్ డేనే దాదాపు రూ. 6 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే ఇదే జోరును మాత్రం రెండో రోజు కొనసాగించడంలో విఫలం అయ్యింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈగల్ రెండో రోజు సుమారు రూ. 4.75 కోట్లను రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 10 కోట్లు వసూళ్లు సాధించింది.

అయితే 22 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగిన మాస్ మహారాజా క్లీన్ హిట్ కొట్టాలంటే ఇంకా 13 కోట్లు కొల్లగొట్టాల్సి ఉంది. కాగా.. వీకెండ్ అయిన శనివారమే కలెక్షన్లు తగ్గాయి అంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఆదివారం (మూడోరోజు) కలెక్షన్లు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా పెద్ద హీరోల సినిమాలు ఏవీ ప్రస్తుతం లేకపోవడం రవితేజకు కలిసొచ్చే అంశం. రజినీకాంత్ లాల్ సలామ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం కూడా ఈగల్ కు ప్లస్ పాయింట్ అయ్యింది. దీంతో థియేటర్ రన్ టైమ్ లోపు ఈగల్ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ పండితులు పేర్కొంటున్నారు. మరి మాస్ మహారాజా రెండు రోజుల్లో సాధించిన వసూళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Sundeep Kishan: ఊరు పేరు భైరవకోనకి మంచి హైప్ తెచ్చిన ‘హరోం హర’ పాట

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio