Somesekhar
Ravi Teja Discharged: మాస్ మహారాజా రవితేజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
Ravi Teja Discharged: మాస్ మహారాజా రవితేజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
Somesekhar
టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. “సర్జరీ సక్సెస్ ఫుల్ అయ్యింది ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మీ అభిమానం, ప్రేమ, మద్ధతుకు నా ధన్యవాదాలు. త్వరలోనే షూటింగ్ కు వస్తాను అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దాంతో ఫ్యాన్స్ హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు.
మాస్ మహారాజా రవితేజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. కాగా.. రవితేజ నటిస్తున్న #RT75(వర్కింగ్ టైటిల్) సినిమాలో స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఆ గాయాన్ని లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొనడంతో.. గాయం తీవ్రత ఎక్కువైంది. దాంతో సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. రవితేజ కుడి చేతికి హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స జరిగింది. 6 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు తెలిపారు. కాగా.. షూటింగ్ లో భాగంగా గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతడు పలు సినిమాలకు రైటర్ గా పనిచేశాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో మాస్ మహారాజాకు జోడీగా శ్రీలీల నటిస్తోంది.
Successfully discharged after a smooth surgery and feeling fine. Grateful for all your warm blessings and support ❤️🙏
Excited to be back on set soon 👊
— Ravi Teja (@RaviTeja_offl) August 24, 2024