iDreamPost
android-app
ios-app

VV Vinayak: స్టార్ డైరెక్టర్ VV వినాయక్ కు సర్జరీ? అసలేం జరిగిందంటే?

  • Published Aug 24, 2024 | 2:18 PM Updated Updated Aug 24, 2024 | 2:18 PM

VV Vinayak, Surgery: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కు మేజర్ సర్జరీ జరిగినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

VV Vinayak, Surgery: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కు మేజర్ సర్జరీ జరిగినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Aug 24, 2024 | 2:18 PMUpdated Aug 24, 2024 | 2:18 PM
VV Vinayak: స్టార్ డైరెక్టర్ VV వినాయక్ కు సర్జరీ? అసలేం జరిగిందంటే?

VV వినాయక్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు. ఒకప్పుడు మాస్ చిత్రాలకు ఆయన పెట్టింది పేరు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆది’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు వినాయక్. ఆ తర్వాత వరుసగా బాలయ్యతో చెన్నకేశవరెడ్డి, నితిన్ తో దిల్, మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ చిత్రాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. దాంతో ఒక్కసారిగా వినాయక్ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. అయితే ఇది ఒకప్పటి విషయం. ప్రస్తుతం ఆయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. దానికి కారణం ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడమే అని తెలుస్తుంది. తాజాగా వినాయక్ కు మేజర్ సర్జరీ జరిగినట్లు సమాచారం.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కు మేజర్ సర్జరీ జరిగినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ గా మారాయి. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లివర్ కు సమస్య ఉందని తేలింది. చికిత్స నిమిత్తం లివర్ కు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారట. దాంతో తాజాగా హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని కామినేని హాస్పిటల్ లో ఆయనకు మేజర్ ఆపరేషన్ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం వినాయక్ ఆరోగ్యం బాగుందని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది.

అయితే వినాయక్ సర్జరీకి సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం బయటకిరాలేదు. కాగా.. గత కొంత కాలంగా వినాయక్ కు ఆరోగ్యం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్ని ఫొటోల్లో ఆయన చిక్కిపోయినట్లుగా కూడా కనిపించారు. ఇక సర్జరీ వార్త వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన డైరెక్టర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. వినాయక్ చివరిగా బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో ‘ఛత్రపతి’ మూవీని రీమేక్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ ను ప్రకటించలేదు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss