iDreamPost
android-app
ios-app

అలాంటి బట్టలు వేసుకోమన్నారు.. షారుక్ బతిమిలాడినా ఒప్పుకోలేదు: రవీనా టాండన్

  • Published Aug 10, 2024 | 5:52 PM Updated Updated Aug 10, 2024 | 5:52 PM

Shah Rukh Khan-Raveena Tandon: ఇండస్ట్రీలో హిట్ పెయిర్స్​కు ఉండే క్రేజ్ వేరు. వాళ్లు మళ్లీ నటిస్తే చూడాలని అభిమానులు ఎదురు చూస్తుంటారు. అలాంటి క్రేజీ పెయిర్స్​లో ఇదొకటి.

Shah Rukh Khan-Raveena Tandon: ఇండస్ట్రీలో హిట్ పెయిర్స్​కు ఉండే క్రేజ్ వేరు. వాళ్లు మళ్లీ నటిస్తే చూడాలని అభిమానులు ఎదురు చూస్తుంటారు. అలాంటి క్రేజీ పెయిర్స్​లో ఇదొకటి.

  • Published Aug 10, 2024 | 5:52 PMUpdated Aug 10, 2024 | 5:52 PM
అలాంటి బట్టలు వేసుకోమన్నారు.. షారుక్ బతిమిలాడినా ఒప్పుకోలేదు: రవీనా టాండన్

ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్ పెయిర్స్​కు ఉండే క్రేజ్ వేరు. వాళ్లు మళ్లీ నటిస్తే చూడాలని అభిమానులు ఎదురు చూస్తుంటారు. అలాంటి క్రేజీ పెయిర్స్​లో ఇదొకటి. వాళ్లు స్క్రీన్ మీద చేసే సందడి మామూలుగా ఉండేది కాదు. అందమైన జంటగా పేరు తెచ్చుకున్న వీళ్లు.. ఒక ప్రాజెక్ట్​లో మిస్ అయ్యారు. యాక్ట్ చేసేందుకు హీరోయిన్ ససేమిరా అనడంతో వేరే నటిని తీసుకున్నారు. ఇది జరిగింది బాలీవుడ్​లో. కింగ్ ఖాన్ షారుఖ్, స్టార్ హీరోయిన్ రవీనా టాండన్​లు అప్పట్లో హిందీ చిత్రసీమను షేక్ చేశారు. ‘యే లమ్హే జుదాయి కే’, ‘జాదు’, ‘జమానా దివానా’ లాంటి ఫిల్మ్స్​తో ఆడియెన్స్​ను ఉర్రూతలూగించారు షారుక్-రవీనా జోడీ. అయితే వీళ్ల కాంబోలో మరో మూవీకి అంతా రెడీ అయినా.. దాన్ని రిజెక్ట్ చేశారు రవీనా. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

అలాంటి బట్టలు వేసుకోమని చెప్పడంతో తాను నో చెప్పేశానని రవీనా అన్నారు. పిచ్చి పట్టిందా అంటూ షారుక్ సీరియస్ అయినా తాను మాత్రం ఒప్పుకోలేదని.. ఆఫర్​ను రిజెక్ట్ చేశానని చెప్పారు. కాస్ట్యూమ్స్ నచ్చకపోవడంతో సినిమా చేయనని కరాఖండీగా చెప్పేశానన్నారు రవీనా. ‘షారుక్ హీరోగా నటించిన ఓ సినిమాకు మొదట నన్నే హీరోయిన్​గా అడిగారు. స్టోరీ, అందులో నా రోల్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశా. కానీ మూవీకి సైన్ చేసే టైమ్​లో కాస్ట్యూమ్స్ గురించి డిస్కస్ చేశారు. నేను ధరించే బట్టల గురించి చెప్పినప్పుడు షాక్ అయ్యా. నాకు ఎంతో ఇబ్బందిగా అనిపించింది. కంఫర్టబుల్ అనిపించలేదు. అది చిన్న విషయమే కావొచ్చు. కానీ ప్రాజెక్ట్​కు నో చెప్పా. అలాంటి దుస్తులు వేసుకొని నటించనని అనేశా. ఇది తెలిసి షారుక్ షాక్ అయ్యారు’ అని రవీనా టాండన్ చెప్పుకొచ్చారు.

Raveena tandon about shah rukh khan movie

సినిమాకు తాను నో చెప్పిన విషయం తెలిసి షారుక్ సీరియస్ అయ్యారని రవీనా తెలిపారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నో చెప్పాల్సిన అవసరమేంటి? అంటూ షారుక్ తనను ప్రశ్నించారని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి మరెన్నో మూవీస్​తో మనం ఆడియెన్స్​ను అలరించాలి కదా అని షారుక్ చెప్పారని.. కానీ కాస్ట్యూమ్స్ వల్లే తాను యాక్ట్ చేయలేకపోతున్నానని తెలిపానని రవీన్ వివరించారు. తాను చెప్పిన కారణాన్ని షారుక్ అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఇంతకీ రవీనా నో చెప్పిన ఆ ఫిల్మ్ మరేదో కాదు.. ‘డర్’. ఈ విషయం గతంలో ఓ సందర్భంలో ఆమె తెలిపారు. ఇక, ఇప్పుడు రవీనా ఫుల్ బిజీగా ఉన్నారు. ‘కేజీఎఫ్​ 2’లో రమికాసేన్​గా కనిపించి మెప్పించిన ఆమె.. ప్రస్తుతం ‘వెల్​కమ్ టు ది జంగిల్’ అనే సినిమాలో నటిస్తున్నారు.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet