iDreamPost
android-app
ios-app

విజయ్ లేకుండా సీక్రెట్ గా సినిమా చూసిన రష్మిక! వైరల్ అవుతున్న వీడియో!

  • Author ajaykrishna Published - 08:47 AM, Sat - 15 July 23
  • Author ajaykrishna Published - 08:47 AM, Sat - 15 July 23
విజయ్ లేకుండా సీక్రెట్ గా సినిమా చూసిన రష్మిక! వైరల్ అవుతున్న వీడియో!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బేబీ’. ఈ సినిమాతో యూట్యూబర్ నుండి యాక్టర్ గా మారిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించారు. నిర్మాత ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా కొంతకాలంగా ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేస్తూ వచ్చింది. పాటలు, ట్రైలర్ ఇలా సినిమాలోని ప్రతీ అంశం.. నేటి యువత ఆలోచనలకు.. లవ్ స్టోరీలకు దగ్గరగా ఉండేసరికి విజువల్స్ కి బాగా కనెక్ట్ అయిపోయారు. ఎట్టకేలకు సినిమా జులై 14 ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంచనాలకు తగ్గట్టుగానే మంచి టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతుంది.

ఇక ప్రీమియర్ షోస్ నుండే సెలబ్రిటీలు బేబీ మూవీ కోసం సందడి చేస్తూ వచ్చారు. అయితే.. ఆడియన్స్ సంగతి పక్కన పెడితే.. రిలీజ్ రోజే ఈ సినిమాను హీరోయిన్ రాశిఖన్నాతో కలిసి విజయ్ దేవరకొండ థియేటర్ లో చూశాడు. ఆల్రెడీ వీరికి సంబంధించి వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. అయితే.. తాజాగా బేబీ మూవీని రష్మిక మందన సీక్రెట్ గా థియేటర్ లో చూసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షో అనంతరం.. బ్లూ జీన్స్, వైట్ టి షర్ట్.. బ్లాక్ క్యాప్.. మాస్క్ పెట్టుకొని బయటికి వస్తూ కెమెరా కంటపడింది రష్మిక. అదికూడా సెలబ్రిటీల కోసం వేసిన ప్రీమియర్ షోకి హాజరైనట్లు తెలుస్తుంది. బయటికి వచ్చేటప్పుడు రష్మిక కాస్త ఎమోషనల్ అయినట్లుగా వీడియోలో కనబడుతుంది.

దీంతో రష్మిక వీడియో చూసినవారంతా మరోసారి విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి.. రష్మిక సింగల్ గా కనిపిస్తోంది.. విజయ్ లేకుండానే బేబీ సినిమా చూసేసిందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు రష్మిక.. విజయ్ దేవరకొండల మధ్య రిలేషన్ షిప్ గురించి కూడా డిస్కషన్స్ పెడుతున్నారు ఆడియన్స్. ఆ మధ్య ప్రమోషన్స్ లో రష్మికను వదిన అని కామెంట్ చేశారు ఫ్యాన్స్. ఇన్ని జరుగుతున్నా రష్మిక, విజయ్ లు మాత్రం మా మధ్య కేవలం ఫ్రెండ్ షిప్ ఒక్కటే ఉందని ఓసారి కుండబద్దలు కొట్టేశారు. ఇదిలా ఉండగా.. రష్మిక, విజయ్ ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు కెరీర్ లో బిజీ అయ్యారు. మరి రష్మిక గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş