iDreamPost
android-app
ios-app

నితిన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రష్మిక.. కొత్త హీరోయిన్ ఎవరంటే?

  • Published Jul 12, 2023 | 8:55 PM Updated Updated Jul 13, 2023 | 6:24 PM
  • Published Jul 12, 2023 | 8:55 PMUpdated Jul 13, 2023 | 6:24 PM
నితిన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రష్మిక.. కొత్త హీరోయిన్ ఎవరంటే?

నేషనల్ క్రష్ రష్మికకు పాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ నుంచి నార్త్ దాకా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కన్నడ, తెలుగు, తమిళ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఎంత బిజీ అయిందంటే.. ఒప్పుకున్న సినిమాలకు కూడా డేట్స్ ఇవ్వలేనంత బిజీగా మారిపోయింది. టాలీవుడ్ లో డెబ్యూ చేయించిన డైరెక్టర్.. కెరీర్ లో మంచి హిట్ ఇచ్చిన హీరోలకు కూడా డేట్స్ ఇవ్వలేక సినిమా నుంచి తప్పుకుంది.

రష్మిక మందన్నాకు తెలుగులో చలో సినిమాతో మంచి పేరు, గుర్తింపు వచ్చింది. తర్వాత టాలీవుడ్ ఆఫర్లు కూడా చాలానే వచ్చాయి. వెంకీ కుడుముల తన తొలి చిత్రంలో రష్మికకు మంచి బేస్ వేశాడు. ఆ తర్వాత తన రెండో చిత్రం భీష్మాలో కూడా రష్మికనే హీరోయిన్ గా పెట్టి ఆమె కెరీర్ స్ట్రాంగ్ అయ్యేలా చేశాడు. తన మూడో చిత్రంలో కూడా రష్మికనే హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించి గ్రాండ్ గా పూజా కార్యక్రమం కూడా జరిగింది. మెగాస్టార్ చేతుల మీదుగా క్లాప్ కూడా కొట్టించారు.

#VNRTrio అంటూ హడావుడి కూడా చేశారు. బ్లాక్ బస్టర్ ట్రియో ఈజ్ బ్యాక్ అంటూ మంచి వీడియో కూడా రిలీజ్ చేశారు. కానీ, ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే భారీ యూనిట్ కి భారీ షాక్ తగిలింది. ఆ మూవీ నుంచి రష్మిక తప్పుకుంది. ఈ సందర్భంగా గతంలో నితిన్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. వెంకీ కుడుముల పేపర్ మీద ఓం కూడా రాయక ముందే రష్మిక పేరు రాస్తాడు అంటూ హీరో నితిన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ మాటలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. కానీ, అలాంటి వెంకీ కుడుములకు ఇంకో హీరోయిన్ ని వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప-2, హిందీలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటికే డేట్స్ అడ్జస్ట్ మెంట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప-2 సినిమాకి కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కావడంతో రష్మిక మాట్లాడుకుని వెంకీ కుడుముల ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు వెంకీ కుడుముల తన ప్రాజెక్ట్ కోసం కొత్త హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించాడు. ప్రస్తుతానికి శ్రీలల పేరును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే శ్రీలల కూడా చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరి.. అంత బిజీగా ఉన్న శ్రీలలను ఎంచుకుని వెంకీ మరోసారి రిస్క్ చేస్తాడా? లేదా? అనేది చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom