iDreamPost
android-app
ios-app

గర్ల్‌ఫ్రెండ్ ఉంటే ఆ కిక్కే వేరురా.. ఆసక్తి రేపుతున్న’ది గర్ల్‌ఫ్రెండ్’గ్లింప్స్

  • Published Oct 22, 2023 | 4:07 PM Updated Updated Oct 22, 2023 | 4:07 PM

అందం, అభినయం కలగలిపిన అందాల తార రశ్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఛలో సినిమాతో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది.

అందం, అభినయం కలగలిపిన అందాల తార రశ్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఛలో సినిమాతో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది.

  • Published Oct 22, 2023 | 4:07 PMUpdated Oct 22, 2023 | 4:07 PM
గర్ల్‌ఫ్రెండ్ ఉంటే ఆ కిక్కే వేరురా.. ఆసక్తి రేపుతున్న’ది గర్ల్‌ఫ్రెండ్’గ్లింప్స్

అందం, అభినయం కలగలిపిన అందాల తార రశ్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఛలో సినిమాతో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న రశ్మికకు సినీ అవకాశాలు క్యూ కట్టాయి. పాన్ ఇండియా మూవీ పుష్ప లో అల్లు అర్జున్ సరసన నటించి నేషనల్ క్రష్ గా మారిపోయింది. కాగా రష్మిక మందన్నా మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా టైటిల్ ను ఆదివారం (అక్టోబర్ 22) మేకర్స్ రివీల్ చేశారు. ఈ మూవీకి ది గర్ల్‌ఫ్రెండ్ అనే పేరు ఖరారు చేశారు.

నేషనల్ అవార్డు విన్నర్ రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ది గర్ల్ ఫ్రెండ్ లో రష్మిక మందన్న కీలక పాత్రలో అలరించబోతోంది. ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. మునుపెన్నడు చూడని లవ్ స్టోరీతో రష్మిక రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ వీడియోలో మొదట ఓ మేల్ వాయిస్ బ్యాక్‌గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటుంది. “దాన్ని నేను ఎంత ప్రేమిస్తున్నానంటే.. దానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరూ అవసరం లేదు రా.. నేను చాలు.. 24 హవర్స్ పిల్ల నాతోనే ఉండాలనిపిస్తది.

నాది అని చెప్పుకోడానికి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంటే ఆ కిక్కే వేరురా” అనే మాటలు సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నీటిలోపల రష్మిక మందన్న కనిపిస్తుంది. మొదట కాస్త నవ్వినట్లుగా కనిపించిన రష్మిక తర్వాత ఒక్కసారిగా ఊపిరాడనట్లుగా కనిపిస్తుంది. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా స్టోరీ కనిపిస్తోంది. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్లు ఈ వీడియో చివర్లో మేకర్స్ చెప్పారు. మరోవైపు రష్మిక ఇప్పటికే టాలీవుడ్ లో పుష్ప 2, బాలీవుడ్ లో యానిమల్ మూవీస్ చేస్తున్న విషయం తెలిసిందే.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş