Venkateswarlu
‘హాయ్ నాన్న ’ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో రష్మిక, విజయ్‌ల...
‘హాయ్ నాన్న ’ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో రష్మిక, విజయ్‌ల...
Venkateswarlu
న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా అతి త్వరంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 7వ తేదీనుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సినిమా టీం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవెంట్ సందర్భంగా రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల ఫొటోలు రచ్చ చేశాయి. సుమ వారి ఫొటోలను స్క్రీన్ మీద ప్రదర్శించారు.
అవి రష్మిక, విజయ్‌లు బాలి వెకేషన్లో దిగిన ఫొటోలు. ఈ ఫొటోలపై గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. వారిద్దరూ ఒకే ప్రదేశంలో ఫొటోలు దిగటంతో.. కలిసే బాలి ట్రిప్‌కు వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై వారినుంచి ఎటువంటి స్పందన రాకపోవటంతో వదంతులు మరింత ఊపందుకున్నాయి. ఇలాంటి సమయంలో ‘హాయ్ నాన్న’ ఈవెంట్లో రష్మిక, విజయ్ ఫొటోలు స్క్రీన్ మీద ప్రదర్శించటం పెద్ద చర్చకు దారి తీస్తోంది.
సుమ ఆ ఫొటోలను మృణాల్ ఠాకూర్‌కు చూపిస్తూ.. దాని మీద ఏదైనా కామెంట్ చేయమని అడిగారు. ఇందుకు మృణాల్ సమాధానం ఇస్తూ.. ‘‘ వెకేషన్ మోడ్ ఆన్’’ అని అన్నారు. ఆ వెంటనే.. ‘‘ ఆకాశం బాగుంది.. రెండు ఫొటోల్లో ఒకేలా ఉంది’’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ రష్మిక, విజయ్‌ల ఫొటోలు ఇప్పుడు సినిమా ప్రమోషన్లకు కూడా వాడుతున్నారా?’’..
‘‘ వాళ్ల ఫొటోలపై మీ రచ్చ.. కామెంట్లు ఏంట్రా?..’’ అని కామెంట్ల చేస్తున్నారు. కాగా, హాయ్ నాన్న సినిమాను వైర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. లవ్ డ్రామా కాన్సెప్ట్‌తో చిత్రం తెరకెక్కింది. హాయ్ నాన్న టీం షూటింగ్ మొదలైన నాటినుంచి ప్రమోషన్లను చేస్తూ ఉంది. నాని,మృణాల్ మీడియాలో, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తమ సినిమా ప్రమోట్ చేస్తూ వచ్చారు. హాయ్ నాన్న నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి..
కొద్దిరోజుల క్రితం విడుదలైన ట్రైలర్ వరకు అన్నిటికీ మంచి స్పందన వచ్చింది. పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అన్ని పాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. ఇక, ట్రైలర్ విషయానికి వస్తే.. సినిమాలో తాను ఏం చూపించాలనుకున్నాడో శౌర్యవ్ ఎంతో చక్కగా చెప్పేశాడు. తండ్రీ కూతుళ్ల మధ్య ప్రేమ ప్రధానంగా సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. మరి, హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక, విజయ్‌ల ఫొటోలు రచ్చ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘హాయ్ నాన్న’ ఈవెంట్లో రష్మిక, విజయ్ ఫొటోలు.. pic.twitter.com/6uUWDyli31
— bandaru venkatesh (@bandaruvenkat17) November 30, 2023