iDreamPost
android-app
ios-app

విదేశీ గడ్డపై చంద్రబోస్, ఆర్పీ పట్నాయక్‌లకు అరుదైన గౌరవం!

  • Published May 07, 2024 | 8:01 PM Updated Updated May 07, 2024 | 8:01 PM

ఇప్పటికే చంద్రబోస్.. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకి విదేశీ గడ్డ మీద ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి విదేశీ గడ్డ మీద అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఈయనతో పాటు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.

ఇప్పటికే చంద్రబోస్.. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకి విదేశీ గడ్డ మీద ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి విదేశీ గడ్డ మీద అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఈయనతో పాటు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.

విదేశీ గడ్డపై చంద్రబోస్, ఆర్పీ పట్నాయక్‌లకు అరుదైన గౌరవం!

తెలుగు సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తనదైన సంగీతంతో ఆయన మనసుకు హత్తుకునే పాటలకు ప్రాణం పోశారు. మరోవైపు చంద్రబోస్ తన సాహిత్యంతో పాటలలు జీవం పోస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరికీ అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని డల్లాస్ లో జరిగిన సుస్వర మ్యూజిక్ అకాడమీలో భాగంగా చంద్రబోస్, ఆర్పీ పట్నాయక్ లను బిరుదులతో సత్కరించారు. డాక్టర్ మీనాక్షి అనిపిండి.. దాదాపు 21 ఏళ్ల నుంచి సుస్వర మ్యూజిక్ అకాడమీ పేరిట ప్రతి ఏటా  వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. కళారంగానికి చెందిన వారిని గుర్తించి సత్కరిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా వేడుకలను నిర్వహించారు.

మే 5న ఆదివారం నాడు డల్లాస్ లో గ్రాండ్ సెంటర్ ఆడిటోరియంలో.. సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజర‌య్యారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ శ్రీ ప్రసాద్ తోటకూర సహా పలువురు అతిథులుగా హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్, ప్రముఖ పాటల రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వి. ఎన్‌. ఆదిత్య‌తో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వార్షిక వేడుకల్లో డాక్టర్ మీనాక్షి అనిపిండి.. తన బృందంతో కలిసి 7 సెగ్మెంట్లలో సాంప్రదాయ సంగీత కీర్తనలను ఆలపించారు. దాదాపు 30కి పైగా సంగీత కీర్తనలను ప్రదర్శన ఇచ్చి అక్కడకి వచ్చిన వారిని ఆకట్టుకున్నారు.

ఈ సాంస్కృతిక ప్రదర్శన దాదాపు 10 గంటల పాటు నిర్విరామంగా సాగింది. అనంతరం చంద్రబోస్, ఆర్పీ పట్నాయక్ లని.. సుస్వర మ్యూజిక్ అకాడమీ వారు సత్కరించారు. చంద్రబోస్ కి “సుస్వర సాహిత్య కళానిధి” బిరుదుతో సత్కరించగా.. ఆర్పీ పట్నాయక్ కి ‘సుస్వర నాదనిధి’ బిరుదుతో సత్కరించారు. ఇక చంద్రబోస్ తన స్వగ్రామమైన చల్లగరిగెలో తల పెట్టిన ఆస్కార్ గ్రంధాల‌య నిర్మాణానికి.. ఈ సుస్వర సాహిత్య అకాడమీ వార్షికోత్సవ వేడుక ద్వారా 15 వేల డాల‌ర్స్ కు పైగా విరాళం వచ్చాయి. మన కరెన్సీ ప్రకారం.. 12 లక్షల 50 వేలు విరాళంగా వచ్చాయి. ఏ వేడుకలో ఆర్. పి. పట్నాయక్ త‌న మాట‌ల‌తో, పాట‌ల‌తో ప్రేక్ష‌కులంద‌రినీ అల‌రించారు.