iDreamPost
android-app
ios-app

ప్రశాంత్- రణవీర్ సినిమా స్టార్ట్! జై హనుమాన్ కంటే ముందుగానే..!

  • Published Apr 29, 2024 | 4:15 PM Updated Updated Apr 29, 2024 | 4:15 PM

హనుమాన్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు బాలీవుడ్ చూపు కూడా తన వైపు తిప్పుకునేలా చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ మూవీ కన్నా ముందు మరో చిత్రాన్ని షురూ చేయబోతున్నాడట.

హనుమాన్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు బాలీవుడ్ చూపు కూడా తన వైపు తిప్పుకునేలా చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ మూవీ కన్నా ముందు మరో చిత్రాన్ని షురూ చేయబోతున్నాడట.

  • Published Apr 29, 2024 | 4:15 PMUpdated Apr 29, 2024 | 4:15 PM
ప్రశాంత్- రణవీర్ సినిమా స్టార్ట్! జై హనుమాన్ కంటే ముందుగానే..!

ఇండస్ట్రీలో సినిమాటిక్ యూనివర్శ్ మూవీల హవా నడుస్తుంది. లోకేశ్ జనకరాజ్ దీనికి ఆద్యం పోసిన సంగతి విదితమే. ఖైదీ, విక్రమ్, లియో ఈ కోవకే వస్తాయి. ఇప్పుడు దీన్నే ఫాలో అవుతున్నాడు తెలుగు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ (పీవీసీయూ) కింద కథలను తెరపైకి ఎక్కించేందుకు సిద్ధం అయ్యాడు. ఇప్పటికే హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్.. జై హనుమాన్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కన్నా ముందే మరో మూవీని తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరోను రంగంలో దింపుతున్నట్లు సమాచారం.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే రెండేళ్ల క్రితమే అధిర అనే మూవీని షురూ చేశాడు ప్రశాంత్. డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరిని పరిచయం చేస్తూ ఓ చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశాడు. మరీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాల్సి ఉంది. షూటింగ్ జరుపుకుంటుందో లేదో కూడా ప్రశ్నార్థకమే. ఇక హనుమాన్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లు కొల్లగొట్టడంతో దీనికి కొనసాగింపు జై హనుమాన్ ఉండబోతుందని భావిస్తున్నారు ప్రేక్షకులు. ఈ రెండు కాకుండా ప్రశాంత్ మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ టాప్ హీరో రణవీర్ సింగ్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. రణవీర్ హీరోగా.. ప్రశాంత్ దర్శకత్వంలో బ్రహ్మ రాక్షస అనే మూవీని తెరకెక్కిస్తున్నాడట.

ఇక బ్రహ్మ రాక్షస కథ రణవీర్‌కు చెప్పడం, ఆయనకు నచ్చి ఓకే అనడం జరిగిపోయిందట. ఇటీవల ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2025లో రిలీజ్ చేయాలని బలంగా భావిస్తున్నాడట ప్రశాంత్. ఈ నేపథ్యంలో జై హనుమాన్ ప్రాజెక్ట్ ఈ ఏడాది పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. రణవీర్ మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారట మేకర్స్. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించనుందని సమాచారం. ఇదే కన్ఫమ్ అయితే.. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు మోస్ట్ హ్యాండ్సమ్.. దీపికా పదుకొనే హాస్బెండ్ రణవీర్. మిగిలిన వివరాలు త్వరలోనే ఎనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş