iDreamPost
android-app
ios-app

ఓటిటి పార్టనర్ ని లాక్ చేసుకున్న రంగబలి! స్ట్రీమింగ్ ఎందులో అంటే..

  • Author ajaykrishna Published - 06:01 PM, Sat - 8 July 23
  • Author ajaykrishna Published - 06:01 PM, Sat - 8 July 23
ఓటిటి పార్టనర్ ని లాక్ చేసుకున్న రంగబలి! స్ట్రీమింగ్ ఎందులో అంటే..

ఈ మధ్యకాలంలో థియేటర్స్ లో విడుదలైన సినిమాలన్నీ కొద్దిరోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ బాటపడుతున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. రిలీజ్ కు ముందే స్ట్రీమింగ్ పార్ట్ నర్ లను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఒక్కోసారి రిలీజ్ అయిపోయి సినిమాల ఫలితాలు వచ్చాక కూడా ఓటిటి రైట్స్ అమ్ముడవుతుంటాయి. అయితే.. కొత్తగా విడుదలైన టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య మూవీ మాత్రం రిలీజ్ ముందే డిజిటల్ పార్ట్ నర్ ని డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. నాగ శౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంగబలి’. యాక్షన్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.

డెబ్యూ డైరెక్టర్ పవన్ బాసంశెట్టి ఈ మూవీ రూపొందించాడు. కాగా.. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. ఓటిటి స్ట్రీమింగ్ పార్ట్ నర్ ని లాక్ చేసుకుంది రంగబలి. లవర్ బాయ్ ఇమేజ్ నుండి మాస్ కమర్షియల్ హీరోగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నాడు హీరో నాగ శౌర్య. ఆ విషయం దృష్టిలో పెట్టుకొనే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ కలబోసిన ఈ సబ్జెక్టును ఎంచుకున్నాడు. అయితే.. శౌర్య తన సినిమాలను ప్రమోట్ చేసే విధానం కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. లాస్ట్ టైం కృష్ణ వ్రిందా విహారి మూవీకి పాదయాత్ర చేసి బజ్ క్రియేట్ చేసుకున్నాడు.

ఆ సినిమా ఫలితం పాజిటివ్ గానే వచ్చింది. అది వేరే విషయం. ఈసారి రంగబలి మాస్ కామెడీ మూవీ కాబట్టి.. చాలా రకాలుగా ప్రమోషన్స్ చేశారు. ముఖ్యంగా కమెడియన్ సత్యతో శౌర్య చేసిన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అందులోనూ ట్రైలర్ బజ్ కూడా తోడై.. మూవీకి ఓపెనింగ్స్ బాగానే వచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలో టెక్నికల్ గా, కథాకథనాల పరంగా ఎలాంటి లోపాలు ఉన్నా.. కామెడీ మాత్రం బాగా ఆకట్టుకుంటుందని టాక్. ఇక అసలు విషయానికి వస్తే.. రంగబలి స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం మూవీ థియేటర్స్ లో రన్ అవుతుంది. కాబట్టి త్వరలో స్ట్రీమింగ్ డేట్ బయటికి వచ్చే అవకాశం ఉంది. సో.. అంతవరకు ఓటిటి లవర్స్ వెయిట్ చేయాల్సిందే.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişcasibomcasibom