iDreamPost
android-app
ios-app

రానాకి మేలు చేసిన రానా నాయుడు! ఇది ఊహించని గిఫ్ట్!

  • Published Jul 20, 2024 | 12:03 PM Updated Updated Jul 20, 2024 | 12:03 PM

Rana Naidu.. లీడర్ మూవీతో హీరోగా మారాడు దగ్గుబాటి వారసుడు రానా. అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇటు నిర్మాతగా, హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. మల్టీ టాలెంట్ కు పర్యాయ పదంగా నిలిచాడు. ఇప్పుడు అతడు ఉత్తమ నటుడిగా మారాడు.

Rana Naidu.. లీడర్ మూవీతో హీరోగా మారాడు దగ్గుబాటి వారసుడు రానా. అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇటు నిర్మాతగా, హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. మల్టీ టాలెంట్ కు పర్యాయ పదంగా నిలిచాడు. ఇప్పుడు అతడు ఉత్తమ నటుడిగా మారాడు.

  • Published Jul 20, 2024 | 12:03 PMUpdated Jul 20, 2024 | 12:03 PM
రానాకి మేలు చేసిన రానా నాయుడు! ఇది ఊహించని గిఫ్ట్!

తాత, తండ్రి, బాబాయి నుండి సినీ వారసత్వాన్ని తీసుకున్నాడు రానా. లీడర్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ దగ్గుబాటి వారసుడు.. తొలి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకున్నాడు. బాలీవుడ్‌లో బాబాయి వెంకటేశ్‌కు సాధ్యం సక్సెస్‌ను తన రెండవ చిత్రంతోనే అందుకున్నాడు. కృష్ణం వందే జగద్గురుమ్ తనలోని వర్సటాలిటీని బయటపెట్టింది. ఇక బాహుబలిలో నెగిటివ్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు. తమిళ్, తెలుగు, హిందీ చిత్రాలు చేస్తూ వరుస బిజీగా ఉన్నాడు. ఇటు నిర్మాతగాను రాణిస్తున్నాడు. అలాగే టెలివిజన్ షోస్ చేస్తున్నాడు. బాలీవుడ్, టాలీవుడ్‌కు వారధిగానూ నిలుస్తున్నాడు ఈ యంగ్ టాలెంట్. ఇదిలా ఉంటే తన బాబాయ్ వెంకటేశ్‌తో కలిసి రానా గత ఏడాది రానా నాయుడు అనే వెబ్ సిరీస్ నటించాడు.

రానా నాయుడు వెబ్ సిరీస్ తీవ్ర విమర్శల పాలైనప్పటికీ.. నెట్ ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూవర్ షిప్ సొంతం చేసుకుంది. రానా పాత్ర ఓకే అనిపించింది కానీ, వెంకటేశ్ నటనను జీర్ణించుకోలేకపోయారు ఫ్యామిలీ ఆడియన్స్. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ సీక్వెల్ రాబోతుంది. ఇదిలా ఉంటే.. రానా నాయుడులో నటనకుగాను రానాకు ఉత్తమ నటుడి అవార్డును పొందాడు. ఇండియన్ టెలి అవార్డు 2024లో భాగంగా ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో రానా హాజరు కాకపోవడంతో ఆయన బదులు రానా నాయుడు డైరెక్టర్ అవార్డును అందుకున్నాడు. ఈ అవార్డు రావడంపై రానా స్పందిస్తూ. చాలా గౌరవంగా ఉందని తెలిపాడు. తనకు చాలా మంది సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నాడు. రానా నాయుడు వెబ్ సిరీస్ 2013లో వచ్చిన అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్‌కు రీమేక్.

సుపర్ణ్ వర్మ, కరణ్ అశుమాన్ తెరకెక్కించారు. ఇందులో బాబాయ్, అబ్బాయి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సుచిత్ర పిల్లై, రజనీ బాసుమత్రీ, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా, ఆశిష్ విద్యార్థి తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ తీవ్ర విమర్శలు  వచ్చినప్పటికీ.. ఎన్నో అవార్డులు కొల్లగొట్టింది. రానాకు ఉత్తమ హీరోగా అవార్డు లభించింది.  అతడి నట ప్రస్థానానికి ఈ వెబ్ సిరీస్ కీలకంగా మారింది. ఇప్పు  ప్రస్తుతం రానా, రజనీకాంత్ మూవీ వెట్టియాన్‌లో నటిస్తున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫజిల్, మంజు వారియర్, రితికా సింగ్ నటిస్తున్నారు. టీజె జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ ఏడాది దసరా బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇక వెంకటేశ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇటీవల ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş