P Krishna
Ramayana Serial Actor is a Millionaire: ఒకప్పుడు దూరదర్శన్ లో వచ్చిన రామాయణం సీరియల్ టెలివిజన్ రంగంలో ఓ ప్రభంజనం సృష్టించింది. అప్పట్లో ఈ సీరియల్ ప్రసారం సమయానికి ప్రతి ఒక్కరూ టీవీలకు అతుక్కుపోయేవారు.
Ramayana Serial Actor is a Millionaire: ఒకప్పుడు దూరదర్శన్ లో వచ్చిన రామాయణం సీరియల్ టెలివిజన్ రంగంలో ఓ ప్రభంజనం సృష్టించింది. అప్పట్లో ఈ సీరియల్ ప్రసారం సమయానికి ప్రతి ఒక్కరూ టీవీలకు అతుక్కుపోయేవారు.
P Krishna
ఇప్పటి వరకు దేశంలోని టెలివిజన్ రంగంలో ఎన్నో సీరియల్స్, రియాల్టీ షోలు వచ్చాయి.. వస్తున్నాయి. కానీ నాడూ.. నేడు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిన సిరియల్స్ రెండే రెండు… రామాయణం, మహాభారతం. ఈ రెండు సీరియల్స్ ఒకప్పుడు బుల్లితెరపై ప్రభంజనం సృష్టించాయి. రామాయణం, మహాభారతం సీరియల్స్ వస్తున్నాయంటే.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టీవీ ముందు కూర్చొని తిలకించేవారు. ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరూ తర్వాత సీనీ, ఇతర సీరియల్స్ లో నటిస్తూ మంచి పేరు సంపాదించారు. రామయణంలో నటించిన ఓ నటుడు ఇప్పుడు వేల కోట్లకు అధిపతి అయ్యారు. ఇంతరీ ఆ నటుడు ఎవరు.. ఏలా అన్ని కోట్లకు అధిపతి అయ్యారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
1983 లో దూరదర్శన్ లో ప్రసారమైన ‘రామాయణం’ సీరియల్ కోట్ల మంది ప్రజల్లో హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. రామానంద్ సాగర్ ఈ దృశ్యకావ్యానికి దర్శకత్వం వహించి నిర్మించారు. ఇటీవల కరోనా సమయంలో రామయణం సీరియల్ మరోసారి ప్రచారం చేశారు.. ఎప్పటీకీ ఈ సీరియల్ కొత్త అనుభూతినిస్తుందని అంటుంటారు ప్రేక్షకులు. అప్పట్లో బాలీవుడ్ మూవీస్ రేంజ్ లో ఈ సీరియల్ ని తెరకెక్కించారు. ఆ సమయంలోనే అద్భుతమైన టెక్నాలజీ వాడారు. ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. ముఖ్యంగా రాముడి పాత్రలో నటించిన అరుణ్ గోవిల్, సీత పాత్రలో దీపికా చిఖాలియా నటించింది. రామాయణం తర్వాత ఉత్తర రామాయణం కూడా టీవీలో ప్రసారం అయ్యంది. ఈ సీరియల్ లవ, కుశ కథా నేపథ్యంలో సాగుతుంది. ‘లవ’ పాత్రలో మయూరేష్ క్షేత్రమదే నటించగా.. ‘కుశ’ పాత్రలో స్వప్నిల్ జోషి నటించారు. తర్వాత వీరిద్దరికీ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చినా.. మయూరేష్ క్షేత్రమదే తన 13వ ఏట నటనకు స్వస్తి చెప్పాడు.
ఇండస్ట్రీలో మంచి కెరీర్ ఉన్నప్పటికీ నటనకు గుడ్ బై చెప్పిన మయూరేష్ ఎక్కువగా చదువులపై దృష్టి సారించాడు. ఈ క్రమంనే అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తూ.. తన సొంత కంపెనీ డెవలప్ చేసుకున్నాడు. ప్రస్తుతం 1400 కోట్ల విలువ చేసే కంపెనీని మయూరేష్ రన్ చేస్తూ.. మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. తన కుటుంబంతో సహా అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 2003 లో ప్రపంచ బ్యాంక్ లో పరిశోధకుడిగా తన కెరీర్ ప్రారంభించి.. పలు సంస్థల్లో పనిచేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. 2016 లో ప్రపంచంలోని అతి పెద్ద మార్కెటింగ్ ఫ్లాట్ ఫారమ్ కమిషన్ జంక్షన్ లో అడుగు పెట్టి.. 2019 నాటికి తన సొంత కంపెనీకి సీఈవోగా ఎదిగాడు. ఈ కంపెనీ ఆదాయం 170 మిలియన్ల డాలర్లు(మన కరెన్సీలో రూ.1400 కోట్లు). ఓ వైపు సీఈఓ గా కొనసాగుతూ.. పలు పుస్తకాలు రచిస్తున్నారు. ఇటీవల మయూరేష్ ‘స్పైట్ అండ్ డెవలప్ మెంట్’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.