ఎట్టకేలకు ఓటీటీలోకి గోపీచంద్ ‘రామబాణం’.. స్ట్రీమింగ్ అందులోనే..!

  • Author singhj Updated - 03:19 PM, Tue - 19 December 23

అయితే థియేటర్​లో రిలీజైన తర్వాత ఆరు నుంచి ఎనిమిది వారాల్లోపు ఓటీటీలోకి మూవీస్ వస్తాయనేది తెలిసిందే. సినిమా బాగా ఆడితే ఈ వ్యవధి పెరగొచ్చు. ఒకవేళ మూవీకి వసూళ్లు తగ్గినా, మంచి టాక్ రాకపోయినా కాస్త త్వరగానే ఓటీటీలోకి ప్రత్యక్షమవ్వడం చూస్తూనే ఉంటాం.

అయితే థియేటర్​లో రిలీజైన తర్వాత ఆరు నుంచి ఎనిమిది వారాల్లోపు ఓటీటీలోకి మూవీస్ వస్తాయనేది తెలిసిందే. సినిమా బాగా ఆడితే ఈ వ్యవధి పెరగొచ్చు. ఒకవేళ మూవీకి వసూళ్లు తగ్గినా, మంచి టాక్ రాకపోయినా కాస్త త్వరగానే ఓటీటీలోకి ప్రత్యక్షమవ్వడం చూస్తూనే ఉంటాం.

  • Author singhj Updated - 03:19 PM, Tue - 19 December 23

థియేటర్లలో మిస్సయిన సినిమాలను ఓటీటీల్లో చూసేందుకు మూవీ లవర్స్ ఎదురు చూస్తుంటారనేది తెలిసిందే. అందులోనూ పెద్ద హీరోల చిత్రాలు ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తాయా అని వెయిట్ చేస్తుంటారు. అయితే థియేటర్​లో రిలీజైన తర్వాత ఆరు నుంచి ఎనిమిది వారాల్లోపు ఓటీటీలోకి మూవీస్ వస్తాయనేది తెలిసిందే. సినిమా బాగా ఆడితే ఈ వ్యవధి పెరగొచ్చు. ఒకవేళ మూవీకి వసూళ్లు తగ్గినా, మంచి టాక్ రాకపోయినా కాస్త త్వరగానే ఓటీటీలోకి ప్రత్యక్షమవ్వడం చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని సినిమాలు మాత్రం థియేటర్​లో విడుదలై నెలలు గడుస్తున్నా ఓటీటీల్లోకి రావట్లేదు.

టాలీవుడ్ హీరోలు అఖిల్ ‘ఏజెంట్’, గోపీచంద్ ‘రామబాణం’ సినిమాలు రిలీజై చాన్నాళ్లు అవుతున్నా ఓటీటీలోకి రావడం లేదు. అయితే ఎట్టకేలకు ఇందులో ఒక మూవీ తన ఓటీటీ స్ట్రీమింగ్​ డేట్​ను ఫిక్స్ చేసుకుందని తెలుస్తోంది. గోపీచంద్, డింపుల్ హయతి, జగపతిబాబు, ఖుష్బూ వంటి స్టార్ నటీనటులు  నటించిన ‘రామబాణం’ మూవీ మే 5వ తేదీన ఆడియెన్స్ ముందుకు వచ్చింది. గోపీచంద్​తో గతంలో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి హిట్ మూవీస్ తీసిన శ్రీవాస్ ‘రామబాణం’ను తెరకెక్కించారు. అయితే గోపీచంద్-శ్రీవాస్ కాంబో మరోమారు ఆ మ్యాజిక్​ను రిపీట్ చేయలేకపోయింది.

థియేటర్​లో పెద్దగా ఆడకపోయినా గోపీచంద్ నటించిన మూవీ కావడంతో ‘రామబాణం’ స్ట్రీమింగ్ కోసం ఓటీటీ ఆడియెన్స్, హీరో ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరదించుతూ నెట్​ఫ్లిక్స్ సంస్థ గుడ్​న్యూస్ చెప్పింది. ‘రామబాణం’ను సెప్టెంబర్ 14వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్​కు తీసుకురానున్నట్లు తెలిపింది. దీంతో గోపీచంద్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. మరి.. ‘రామబాణం’ సినిమాను ఓటీటీలో చూసేందుకు మీరు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: తినే తిండిలో పురుగు.. హీరోయిన్ అసహనం!

Show comments