iDreamPost
android-app
ios-app

తినే తిండిలో పురుగు.. హీరోయిన్‌ అసహనం!

  • Published Sep 07, 2023 | 8:31 AM Updated Updated Sep 07, 2023 | 8:31 AM
  • Published Sep 07, 2023 | 8:31 AMUpdated Sep 07, 2023 | 8:31 AM
తినే తిండిలో పురుగు.. హీరోయిన్‌ అసహనం!

ప్రముఖ హీరోయిన్‌ మాల్విక శర్మకు ఊహించని అనుభవం ఎదురైంది. ఓ పెద్ద హోటల్‌లో భోజనం చేసిన ఆమెకు ఫుడ్‌ పాయిజన్‌ అయింది. తినే తిండిలో పురుగులు ఉండటం వల్ల ఈవిధంగా జరిగినట్లు హీరోయిన్‌ చెబుతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. హీరోయిన్‌ మాల్విక శర్మ తాజాగా వైజాగ్‌ వెళ్లింది. వైజాగ్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో విడిది చేసింది. ఆ హోటల్‌లో భోజనం చేస్తుండగా .. తినే తిండిలో పురుగులు కనిపించాయి. దీంతో ఆమె షాక్‌ అయింది. ఆ పురుగుల కారణంగా ఆమెకు ఫుడ్‌ పాయిజన్‌ కూడా అయింది. ఈ నేపథ్యంలో మాల్విక హోటల్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆహారంలో పురుగులు ఉన్న ఫొటోలను తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ‘‘ విశాఖపట్నంలోని హోటల్‌లో భోజనం చేస్తుండగా తినే ఆహారంలో పురుగులు కనిపించాయి. వైజాగ్‌లో ఉండటానికి ఇది ఓ చెత్త హోటల్‌. నేను ఈ హోటల్‌లో ఆహారం తినటం కారణంగా ఫుడ్‌ పాయిజన్‌ అయింది. ఈ హోటల్‌లో ఆహారం తినకండి’’ అంటూ హెచ్చరించింది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు కొందరు ఆమెకు మద్దతు పలుకుతుంటే..

మరికొందరు చిన్న విషయానికి ఎందుకు అంత రచ్చ చేస్తున్నావ్‌ అంటూ మండిపడుతున్నారు. కాగా, మాల్విక శర్మ రవితేజ హీరోగా 2018లో వచ్చిన ‘నేల టికెట్‌’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తర్వాత రామ్‌ హీరోగా 2021లో వచ్చిన ‘రెడ్‌’ అనే సినిమాలో నటించారు. తమిళంలో ‘కాఫీ విత్‌ కాదల్‌’ అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తున్నారు. మరి, హీరోయిన్‌ తినే ఆహారంలో పురుగులు రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom