iDreamPost
android-app
ios-app

బోయపాటిపై తీవ్ర విమర్శలు.. స్పందించిన హీరో రామ్‌!

  • Published Nov 05, 2023 | 1:26 PM Updated Updated Nov 05, 2023 | 1:26 PM

స్కంధ బాగోలేకపోతే.. ఎందుకు బాలయ్య ఫ్యాన్స్‌ తనకు ఫోన్‌ చేస్తారని ప్రశ్నించారు. ఉదయం సినిమా షో అయిపోయిన వెంటనే.. బాలయ్య ఫ్యాన్స్‌ తనకు ఫోన్‌ చేశారని..

స్కంధ బాగోలేకపోతే.. ఎందుకు బాలయ్య ఫ్యాన్స్‌ తనకు ఫోన్‌ చేస్తారని ప్రశ్నించారు. ఉదయం సినిమా షో అయిపోయిన వెంటనే.. బాలయ్య ఫ్యాన్స్‌ తనకు ఫోన్‌ చేశారని..

  • Published Nov 05, 2023 | 1:26 PMUpdated Nov 05, 2023 | 1:26 PM
బోయపాటిపై తీవ్ర విమర్శలు.. స్పందించిన హీరో రామ్‌!

‘స్కంధ’ సినిమా విషయంలో గత కొద్దిరోజుల నుంచి దర్శకుడు బోయపాటి శీనుపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు ఈ వివాదం ముదురుతూ పోతోంది. కొంతమంది రామ్‌ ఫ్యాన్స్‌ బోయపాటి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బోయపాటి తప్పుల కారణంగా స్కంధ అట్టర్‌ ప్లాప్‌ అయిందని మండిపడుతున్నారు. ఇక, ఈ సినిమా ఫలితాలపై తాజాగా బోయపాటి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తాను అందరి కంటే ఎక్కువగా బాలకృష్ణ ఫ్యాన్స్‌ నుంచి రివ్యూలు, అభిప్రాయాలను నమ్ముతానన్నారు.

స్కంధ బాగోలేకపోతే.. ఎందుకు బాలయ్య ఫ్యాన్స్‌ తనకు ఫోన్‌ చేస్తారని ప్రశ్నించారు. ఉదయం సినిమా షో అయిపోయిన వెంటనే.. బాలయ్య ఫ్యాన్స్‌ తనకు ఫోన్‌ చేశారని, సినిమా అత్యాద్భుతంగా ఉందని చెప్పారని పేర్కొన్నారు. ఇక, ఇదే వివాదంపై తాజాగా సినిమా హీరో రామ్‌ స్పందించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘ 22.04.2023 ఇంకా నాకు గుర్తు ఉంది. సమ్మర్‌లోని అత్యంత ఉష్టోగ్రత కలిగిన రోజులవి. 3వ రోజు షూటింగ్‌ సమయానికి కాలు ఈవిధంగా దారుణంగా అయింది. సరిగా నడవ లేని పరిస్థితి ఏర్పడింది.

కాలు నుంచి రక్తం కారుతుంటే నేను షూటింగ్‌ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే, మా దర్శకుడు ఓ షాట్‌ను అప్పుడే తీయాలని డిసైడ్‌ అయ్యారు. దీంతో ఆయనే స్వయంగా ఆ షాట్‌ను చిత్రీకరించారు. సినిమాను ఆదరించటం, ఆదరించకటపోవటం అది ఆడియన్స్‌కు సంబంధించిన చాయిస్‌. నేను మీ అభిప్రాయాలను, గౌరవిస్తాను.. గౌరవిస్తూనే ఉంటాను. నా కోసం స్కంధ ఈ షాట్‌ను చిత్రీకరించినందుకు మా దర్శకుడికి కృతజ్ఞతలు’’ అని రాసుకొచ్చారు. మరి, బోయపాటి శీను వివాదంపై రామ్‌ పోతినేని స్పందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom