Tirupathi Rao
RGV Vyooham Movie: రామ్ గోపాల్ వర్మ వ్యూహం చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ప్రస్తుతం థియేటర్లలో వ్యూహం సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
RGV Vyooham Movie: రామ్ గోపాల్ వర్మ వ్యూహం చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ప్రస్తుతం థియేటర్లలో వ్యూహం సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
Tirupathi Rao
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వ్యూహం సినిమా హాట్ టాపిక్ గా మారింది. చాలారోజులుగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఫిబ్రవరి 23న వ్యూహం సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, దానిని మొదట మార్చి 1కి వాయిదా వేశారు. ఇప్పుడు మార్చి 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా గురించి మొదటి నుంచి రామ్ గోపాల్ వర్మ ఎంతో ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూసిన తర్వాత సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు వ్యూహం థియేటర్లలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది.
వ్యూహం సినిమాని ఏపీ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కించారు. మొదట యధార్థ ఘటనల ఆధారంగానే నిర్మిస్తున్నాం అన్నారు. కానీ, సెన్సార్ ఇబ్బందుల వల్ల కల్పిత పాత్రలు అంటూ చెప్పడం, పాత్రల పేర్లు కూడా మార్చడం చేశారు. ఏది ఏమైనా వ్యూహం సినిమాకి మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రామ్ గోపాల్ వర్మ కూడా స్వయంగా థియేటర్లకు వెళ్లి ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఐనాక్స్ థియేటర్లో వ్యూహం సినిమా ప్రదర్శన జరుగుతోంది. ఆ షోకి వ్యూహంలో ఇంద్రబాబు పాత్ర పోషించిన ఆర్టిస్ట్ ధనుంజయ్ ప్రభునే వచ్చాడు. ఆయన అచ్చం ప్రతిపక్ష నేత చంద్రబాబులానే ఉంటాడు. కాసేపటికి ఆర్జీవీ కూడా ఆ షోకి వచ్చి సినిమా చూశారు.
ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన తర్వాత అందరూ సీబీఎన్ తో కలిసి ఆర్జీవీ వ్యూహం సినిమా చూశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మూవీ తర్వాత ఆర్జీవీ పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. జైలు నుంచి ఎలాగైతే జగన్ విడులయ్యారో.. టీడీపీ జైలు నుంచి వ్యూహం సినిమా ఈరోజు విడుదలైంది అన్నారు. అలాగే ఈ మూవీ జస్ట్ ట్రైలర్ మాత్రమే అని చెప్పారు. అసలు కథ శపథం మూవీలో ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే ధనుంజయ్ ప్రభునే కూడా మూవీపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తాను ఎక్కడో వారణాసిలో ఉండేవాడినని.. తనని తీసుకొచ్చి నటుడిని చేశారు అన్నారు. వ్యూహం సినిమా తనకు బాగా నచ్చిందన్నారు.
మదన్మోహన్ రెడ్డి తండ్రి వీఎస్ వీరశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తాడు. ఆ తర్వాత మదన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తండ్రి మరణంతో రాష్ట్రంలో వందల మంది ప్రాణాలు కోల్పోతారు. ఆ విషయం తెలుసుకున్న మదన్ ఓదార్పు యాత్ర చేయాలి అనుకుంటాడు. అందుకు సొంతపార్టీ అయిన భారత్ పార్టీ హైకమాండ్ అడ్డు తగులుతుంది. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడు ఇంద్రబాబుతో కలిసి మదన్ పై తప్పుడు కేసులు పెట్టించి జైలు పాలు చేస్తారు. మదన్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎలా ఎదిరించాడు, ప్రజలు మెచ్చిన నాయకుడు ఎలా అయ్యాడు అనేదే వ్యూహం కథ.