iDreamPost
android-app
ios-app

నా పోస్టర్ కాపీ కొట్టాడు… పవన్ కళ్యాణ్ పై వర్మ సెటైర్!

  • Published Sep 11, 2023 | 9:57 AM Updated Updated Sep 11, 2023 | 9:57 AM
  • Published Sep 11, 2023 | 9:57 AMUpdated Sep 11, 2023 | 9:57 AM
నా పోస్టర్ కాపీ కొట్టాడు… పవన్ కళ్యాణ్ పై వర్మ సెటైర్!

తెలుగు ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే వెంటనే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అంటుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వర్మ ఏది చేసినా ఒక సంచలనమే అంటుంటారు. సినిమా తీసినా, దాని ప్రమోషన్ గురించి చర్చించినా.. ట్విట్లు చేసినా ప్రతీదీ సంచలనం, వివాదాస్పదంగా ఉంటాయి. ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఆయన ఇటీవల చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ చేయడం లేదని ఇండస్ట్రీ టాక్. కానీ ఆయన చేసే ట్విట్లు మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటాయి. సిని, రాజకీయ, క్రీడా ఒక్కటేమిటి అన్నీ రంగాలకు చెందిన వారిపై తనదైన స్టైల్లో ట్విట్స్ చేస్తూ హంగామా సృష్టిస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ పై వర్మ సెటైర్ గా చేసిన ట్విట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

రాంగోపాల్ వర్మ త్వరలో ‘వ్యూహం’చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫోటోలు, టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం తర్వాత ఏపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే అంశాలపై ఈ సినిమా చూపించబోతున్నారట. రంగం ఫేమ్ అజ్మల్ ఈ సినిమాలో వైయస్ జగన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనంగా ఉంటున్నాయి. తాజాగా రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ ఫోటోలు షేర్ చేశారు. మొన్నటి నుంచి ఏపీలో జరిగిన చంద్రబాబు ఎపిసోడ్ ఎంత ఉత్కంఠంగా సాగిందో అందరికీ తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో బాబు 14 రోజులు రిమాండ్ కి తరలించారు.

చంద్రబాబు ని అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో అప్పజెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ విజయవాడకు వెళ్లే ప్రయత్నంలో పెద్ద డ్రామా నడిచింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే క్రమంలో పవన్ కళ్యాణ్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కొద్దిసేపు నేలపై కూర్చొని, పడుకొని.. నడుచుకుంటూ వెళ్లడం లాంటివి చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్ పై వర్మ ఓ ఫోటో షేర్ చేస్తూ.. పై ఫోటో నేను నెల క్రితం రిలీజ్ చేసిన ‘వ్యుహం’ సినిమా ఫొటో.. కింద నిన్న రాత్రి రోడ్డు మీద తీసిన రియల్ ఫోటో అంటూ పవన్ కళ్యాణ్ నేలపై కూర్చున్నది, పడుకున్న ఫోటో షేర్ చేశాడు. అలాగే చంద్రబాబు పెళ్లిరోజుపై కూడా పంచ్ వేశాడు. వివాహం తర్వాత చాలా మంది జైలు జీవితం అంటారు.. ఆ జైలు జీవితం నుంచి నిజమైన జైలుకి చంద్రబాబు వెళ్తున్నారు.. అంటే జైల్ టూ జైల్ ప్రోగ్రాం జరగడం విశేషం అని ట్విట్ చేశారు. ఇది ఆయనకు చెంపదెబ్బ, కర్మ ఫలం అంటూ అభివర్ణించారు. ప్రస్తుతం ఈ ట్విట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet