iDreamPost
android-app
ios-app

Ram Gopal Varma: SSMB 29పై RGV ఇంట్రెస్టింగ్ కామెంట్స్! జక్కన్న..

  • Published Jul 24, 2024 | 4:22 PM Updated Updated Jul 24, 2024 | 4:22 PM

సూపర్ స్టార్ మహేశ్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రాబోతున్న SSMB 29 మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆ వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ మహేశ్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రాబోతున్న SSMB 29 మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆ వివరాల్లోకి వెళితే..

Ram Gopal Varma: SSMB 29పై RGV ఇంట్రెస్టింగ్ కామెంట్స్! జక్కన్న..

ఓ సినిమా వస్తుందంటే, షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే.. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆ మూవీపై పలు రకాలుగా స్పందిస్తుంటారు. అయితే ఒక్కోసారి వాళ్ల కామెంట్స్ మూవీపై భారీ అంచనాలను పెంచేస్తుంటాయి. మరి ఇలాంటి వ్యాఖ్యలు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేస్తే.. ఆ చిత్రానికి కావాల్సినంత హైప్ వస్తుంది. తాజాగా ఆర్జీవీ సూపర్ స్టార్ మహేశ్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రాబోతున్న SSMB 29 మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జక్కన్నను ఆకాశానికి ఎత్తేశాడు ఆర్జీవీ. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

SSMB 29.. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నమూవీ. మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నాడు. అమెజాన్ అడవుల్లో సాగే ఆఫ్రికన్ అడ్వెంచరల్ మూవీగా పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ గురించి తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆ వ్యాఖ్యలతో సినిమాపై సూపర్ హైప్ ను పెంచేశాడు ఆర్జీవీ.

“SSMB 29 సినిమా అన్ని సినిమాలకు బాప్ లా ఉంటుందనుకుంటున్నాను. ఎందుకంటే? ఆర్ఆర్ఆర్ తర్వాత ఎక్కువ టైమ్ సాంకేతిక నిపుణులతోనే గడుపుతున్నాడు.  ఇక రాజమౌళి సాధిస్తున్న విజయాలు తెలుగు సినిమాకు సంబంధించినవని నేను అనుకోను. ఒకవేళ అతను గుజరాత్ కు చెందిన వ్యక్తి అయినా.. ఇదే రేంజ్ సినిమాలు తీసి పేరు తెచ్చుకునేవాడు. ఇక మహేశ్ బాబు-రాజమౌళిల మూవీ మన ఊహకు కూడా అందదని నేను అనుకుంటున్నాను. వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ ను ఈ సినిమా కోసం వాడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన విజన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే” అంటూ జక్కన్నను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ కామెంట్స్ SSMB 29పై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్లు కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరి జక్కన్నపై ఆర్జీవీ ప్రశంసలు కురిపించడం మీకేవిధంగా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetVirüsbetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Giriş