iDreamPost
android-app
ios-app

Ram Charan: రామ్ చరణ్ కు అరుదైన గౌరవం! ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్..

  • Published Jul 17, 2024 | 11:40 AM Updated Updated Jul 17, 2024 | 11:40 AM

రామ్ చరణ్ ఓ అరుదైన ఘనతను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

రామ్ చరణ్ ఓ అరుదైన ఘనతను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jul 17, 2024 | 11:40 AMUpdated Jul 17, 2024 | 11:40 AM
Ram Charan: రామ్ చరణ్ కు అరుదైన గౌరవం! ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్..

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. తనదైన నటనతో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిన ‘మగధీర’తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ రేంజ్ కు తన స్థాయిని పెంచుకున్నాడు ఈ స్టార్ హీరో. కాగా.. తాజాగా రామ్ చరణ్ ఓ అరుదైన ఘనతను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్. ఆ వివరాల్లోకి వెళితే..

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది ఈ చిత్రం. అయితే షూటింగ్ కు కాస్త బ్రేక్ రావడంతో చరణ్ ఫ్యామిలీతో కలిసి లండన్ కు వెళ్లాడు. చెర్రీ లండన్ కు వెళ్లడానికి ప్రత్యేక కారణం ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదేంటంటే? లండన్ లోని ప్రతిష్టాత్మకమైన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారట. రామ్ చరణ్ గ్లోబల్ ఫాలోయింగ్ ను పరిగణంలోకి తీసుకున్న మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారట. అందులో భాగంగా కొలతలు ఇవ్వడానికే చరణ్ అక్కడికి వెళ్లాడని సమాచారం.

ఇదిలా ఉండగా.. ఈ మైనపు విగ్రహానికి ఓ ప్రత్యేక ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ చేతిలో ఎప్పుడూ ఓ కుక్క పిల్ల చేతిలో ఉంటుంది. దాని పేరు రైమ్. ఫ్రెంచ్ బార్బెట్ జాతికి చెందిన ఈ కుక్క పిల్లను ఎక్కడి వెళ్లినా తీసుకెళ్లడం చరణ్ దంపతులకు అలవాటు. అందుకే ఆ కుక్కపిల్లను ఎత్తుకున్న చరణ్ మైనపు విగ్రహాన్నే టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడికానున్నట్లు తెలుస్తోంది. ఇక తమ అభిమాన హీరోకు దక్కుతున్న అరుదైన గౌరవాన్నిచూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి చరణ్ కు దక్కుతున్న ఈ అరుదైన గౌరవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss