ఇండస్ట్రీలో ఉన్నటువంటి బెస్ట్ కపుల్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. రీసెంట్ గా ఈ కపుల్ పేరెంట్స్ గా మారిన విషయం తెలిసిందే. తమ కూతురు క్లింకారను నిమిషం వదలకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. దాదాపు 11 ఏళ్లుగా ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చారు ఈ మెగా కపుల్. ఇక ఈ మధ్యనే ఉపాసన తన బర్త్ డే సందర్బంగా ఓ వీడియో షేర్ చేస్తూ.. తల్లిగా తాను మరోసారి పుట్టానని చెప్పుకొచ్చింది. చరణ్, ఉపాసన అటు భార్యాభర్తలుగా.. ఇటు మెగా ఫ్యామిలీ లెగసిని ముందుకు నడిపించే వారసులుగా ఎంతో హుందాగా మెలుగుతుంటారు. వీరిది లవ్ మ్యారేజ్ అనే సంగతి తెలిసే ఉంటుంది.
గతంలో వీరి లవ్ స్టోరీ కూడా షేర్ చేసుకున్నారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా చరణ్ కి ఉపాసన పరిచయం అయ్యిందని.. ఆ తర్వాత ఫ్రెండ్స్ అయిన వీరు మెల్లగా లవ్ లో పడి.. కొన్నాళ్ళకు పెళ్లి చేసుకొని ఒక్కటి అయిపోయారు. అయితే.. పెళ్లయ్యాక ఏ భర్త అయినా తన భార్యతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. చరణ్ కూడా అంతే. ఖాళీ దొరికితే.. భార్యతో వేకెషన్స్ కి, షాపింగ్ కి వెళ్ళిపోతుంటాడు. అయితే.. పెళ్ళైన కొత్తలో భార్యకు కొత్త కొత్త గిఫ్టులు ఇచ్చేవాడట చరణ్. కానీ.. ఆమెకు గిఫ్ట్స్ నచ్చేవి కాదట. దీంతో ఒకానొక టైంలో ఉపాసన చేతిలో ప్రేమగా చెంపదెబ్బలు కూడా తిన్నానని చరణ్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా కమెడియన్ తన్మయ్ భట్ తో పాల్గొన్న ఇంటర్వ్యూలో చరణ్ ఈ విషయాలు. చెప్పుకొచ్చాడు.
ఓ క్లాత్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న చరణ్.. ‘ఎవరికోసమైనా ఆన్ లైన్ షాపింగ్ చేశారా?’ అని అడిగితే ఇలా చెప్పాడు. “పెళ్ళైన కొత్తలో నా భార్య ఉపాసన కోసం ఒక కాస్ట్లీ గిఫ్ట్ కొన్నాను. అది వెతడానికి దాదాపు ఐదు గంటలు పట్టింది. అది డెలివరీ వచ్చాక తీసుకెళ్లి ఉపాసనను సర్ ప్రైజ్ చేశా. కానీ.. తాను ఆ గిఫ్ట్ ని అవతలకు పారేసి.. నన్ను చిన్నగా చెంప దెబ్బ కొట్టేసి వెళ్ళిపోయింది. అందుకే ఆడవాళ్లకు సర్ప్రైజ్ గిఫ్టులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తపడాలి. ఏదైనా వాళ్లని అడిగి కొంటే బెటర్ అని నా ఫీలింగ్” అని తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం చరణ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ చేస్తూ.. బుచ్చిబాబుతో ఓ సినిమా లైనప్ చేశాడు. మరి చరణ్, ఉపాసన జంట గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.