iDreamPost
android-app
ios-app

గేమ్ ఛేంజర్ అప్ డేట్ లో రామ్ చరణ్ చేతిలోని బుక్ గమనించారా?

  • Published Mar 26, 2024 | 4:09 PM Updated Updated Mar 26, 2024 | 4:09 PM

Ram Charan Game Changer Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ రాబోతోంది. ఆ అప్ డేట్ కి అప్ డేట్ గా ఇచ్చిన పోస్టర్ లో ఈ పుస్తకాన్ని గమనించారా?

Ram Charan Game Changer Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ రాబోతోంది. ఆ అప్ డేట్ కి అప్ డేట్ గా ఇచ్చిన పోస్టర్ లో ఈ పుస్తకాన్ని గమనించారా?

  • Published Mar 26, 2024 | 4:09 PMUpdated Mar 26, 2024 | 4:09 PM
గేమ్ ఛేంజర్ అప్ డేట్ లో రామ్ చరణ్ చేతిలోని బుక్ గమనించారా?

మార్చి 27 కోసం మెగా ప్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు కాబట్టి. అలాగే ఫర్ ఏ లాంగ్ గ్యాప్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఒక మంచి అప్ డేట్ రాబోతోంది. జరగండి అనే సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 27న ఉదయం 9 గంటలకు ఈ సాంగ్ రిలీజ్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో చరణ్ ఎంతో స్టైలిష్ గా ఉన్నాడు. అయితే అందరి దృష్టిని ఆకర్షించేలా చరణ్ చేతిలో ఒక పుస్తకం ఉంది. ఇప్పుడు ఇస్తోంది కేవలం సాంగ్ అప్ డేట్ మాత్రమే కాదు.. సినిమా గురించి ఒక క్లారిటీ కూడా ఇచ్చేస్తున్నారు అని అర్థమైపోయింది. అసలు ఆ బుక్ ఏంటి? బుక్ ద్వారా సినిమా గురించి ఏం క్లారిటీ వచ్చిందో చూద్దాం.

ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి రాబోతున్న గేమ్ ఛేంజర్ పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. వాటికి తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుందనే నమ్మకం కూడా ఉంది. అయితే ఎక్కడో ఒక మూల సినిమా ఎలా ఉంటుందో అనే గిలి చాలా మంది అభిమానుల్లో ఉంది. అలాంటి వారికి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది. అదేంటంటే.. జరగండి సాంగ్ అప్ డేట్ కి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో రామ్ చరణ్ నడుచుకుంటూ వస్తున్నట్లు ఉంది. స్టైలిష్ లుక్స్ తో సాంగ్ అయితే నెక్ట్స్ లెవల్లో ఉండబోతోందనే క్లారిటీ వచ్చింది. అలాగే రామ్ చరణ్ చేతిలో ఒక బుక్ ఉంది.

అందరూ ఇప్పుడు ఆ బుక్ గురించే మాట్లాడుతున్నారు. ఆ బుక్ మరేదో కాదు.. చలం రచించిన ప్రేమలేఖలు అనే పుస్తకం అది. అంటే ఈ మూవీలో సోషల్ కాజ్, పాలిటిక్స్ మాత్రమే కాదు.. అంతకు మించిన లవ్ స్టోరీ కూడా ఉండబోతోంది. శంకర్ ఎంత సమాజిక సమస్యల మీద సినిమా తీసినా కూడా అందులో లవ్ ట్రాక్ మాత్రం ఉంటుంది. జెంటిల్ మ్యాన్, భారతీయుడు, ఒకే ఒక్కడు నుంచి శివాజీ, రోబో వరకు చూసినా ఆ ప్యాట్రన్ అయితే కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో కూడా అదే వర్షన్ ఉండబోతోంది అనిపిస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పటివరకు ఒక సోషల్ కాజ్ కోసం వస్తున్న సినిమాగానే ప్రేక్షకులకు చూస్తున్నారు.

Game changer new poster

ఇప్పుడు మాత్రం ఇందులో మంచి లవ్ స్టోరీ కూడా ఉండబోతోందని క్లారిటీ వచ్చింది. పైగా శంకర్ స్పెషల్ టచ్ ఈ సినిమాలో ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. గేమ్ ఛేంజర్ సినిమా అటు శంకర్ కెరీర్లోనే కాకుండా.. రామ్ చరణ్ కెరీర్లో కూడా మంచి హిట్టుగా నిలుస్తుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రామ్ చరణ్ మరోసారి సుకుమార్ తో ప్రాజెక్ట్ ఒప్పుకున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన అధికారిక అప్ డేట్ కూడా ఇచ్చేశారు. మరి.. గేమ్ ఛేంజర్ సినిమాలో ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet