iDreamPost
android-app
ios-app

‘లియో’లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. అసలు నిజమేంటంటే?

  • Author Soma Sekhar Published - 03:10 PM, Tue - 10 October 23
  • Author Soma Sekhar Published - 03:10 PM, Tue - 10 October 23
‘లియో’లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. అసలు నిజమేంటంటే?

సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారుతోంది. ఆ ట్రెండ్ కు తగ్గట్లు డైరెక్టర్లు కూడా మారుతున్నారు. మూవీ యూనివర్స్ ల పేరిట ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ నడుస్తోంది. దీంతో పాటుగా ఇద్దరు ముగ్గురు హీరోలను సినిమాలో క్యామియో రోల్స్ లో మెరిపించి.. అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు మేకర్స్. ఇలాంటి క్యామియో రోల్ కు సంబంధించిన ఓ వార్త గత కొన్ని నెలలుగా వైరల్ గా మారింది. అదేంటంటే? దళపతి విజయ్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న సినిమా లియో. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కు విశేషమైన స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో మరోసారి లియోలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నారన్న వార్తలు వైరల్ గా మారాయి. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటు ఇండస్ట్రీలో.. అటు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వైరలవుతున్న న్యూస్ లియో లో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్-త్రిష జంటగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేయబోతున్నారన్న వార్త లియోపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో.. ఇటు దళపతి ప్యాన్స్ తో పాటుగా అటు మెగా అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయ్యారు. ఈ వార్త ఇంతలా వైరల్ కావడానికి కారణం ఏంటంటే? ఇటీవల రామ్ చరణ్ స్వయంగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ను హీరో విజయ్ లను లంచ్ కు ఆహ్వానించినట్లుగా, వారిద్దరు కూడా లంచ్ కు వస్తామని తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో లియో సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడనే ప్రచారానికి బలం చేకూరింది.

అయితే కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ లియోలో నటించలేదని తెలుస్తోంది. కాగా.. ఎప్పటి నుంచో ఈ వార్తలు వస్తున్నప్పటికీ మూవీ యూనిట్ మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. అక్టోబర్ 19 దసరా కానుకగా లియో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. ఓ టికెట్ బుకింగ్ వెబ్ సైట్ నటీనటుల వివరాల్లో రామ్ చరణ్ పేరును కూడా అందులో రాయడం గమనార్హం. దీంతో లియోలో రామ్ చరణ్ నటిస్తున్నాడనే వార్తలకు మరింతగా బలం చేకూరినట్లు అవుతోంది. కాగా.. ఈ విషయంపై చిత్రం బృందం ఏవింధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş