iDreamPost
android-app
ios-app

గేమ్ ఛేంజర్ కొత్త రిలీజ్ డేట్! విడుదల ఆ రోజేనా?

Game Changer New Release Date: రామ్ చరణ్- డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ కి సంబంధించి కొత్త డేట్ వినిపిస్తోంది.

Game Changer New Release Date: రామ్ చరణ్- డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ కి సంబంధించి కొత్త డేట్ వినిపిస్తోంది.

గేమ్ ఛేంజర్ కొత్త రిలీజ్ డేట్! విడుదల ఆ రోజేనా?

గేమ్ ఛేంజర్.. టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ గురించి జరిగిన చర్చ మరో సినిమా గురించి జరగడం లేదు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం, రామ్ చరణ్ కెరీర్ లో 15వ చిత్రం, డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు.. అంటూ మెగా ఫ్యాన్స్ ఈ మూవీ గురించి చాలానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తుంటే.. సినిమా ప్రకటించి మూడేళ్లు పూర్తవుతున్నా ఇంకా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడం లేదు. ఇన్నాళ్లు సెప్టెంబర్ లో ఈ మూవీ రాబోతోంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ, ఇప్పుడు ఆ డేట్ కూడా కాదు అంటూ టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి ఏడాది ముందే డైరెక్టర్ శంకర్ తో ఆర్సీ 15 మూవీ అనౌన్స్ చేశారు. రాజమౌళి మూవీ తర్వాత ఎలాంటి సినిమా తీస్తాడో అంటూ అందరూ కాస్త కంగారు పడ్డారు. కానీ, అందరినీ ఆనందంలో ముంచెత్తుతో రామ్ చరణ్ శంకర్ తో అనౌన్స్ చేశాడు. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్ డేట్స్ రావడం లేదు. సినిమా ఏ స్టేజ్ లో ఉంది? ఎంత వరకు షూటింగ్ పూర్తైంది వంటి వివరాలు తెలియలేదు. ఇప్పటికే మూడేళ్లు పూర్తవుతోంది. డైరెక్టర్ శంకర్ చూస్తే.. అటువైపు ఇండియన్ 2 సినిమా కూడా చేస్తున్నాడు.

సినిమా లేట్ అవుతోంది సరే.. అప్ డేట్స్ అయినా ఇవ్వచ్చు కదా అంటూ ఫ్యాన్స్ తమ అసహనాన్ని నెట్టింట వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటివలీ మూవీ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సెప్టెంబర్ లో వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇంకేముంది.. ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఏదో ఒక అప్ డేట్ అయితే వచ్చిందిలే అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు మాత్రం ఇది మెగా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే గేమ్ ఛేంజర్ రిలీజ్ కి సంబంధించి ఇంకో కొత్త డేట్ వినిపిస్తోంది. అది సెప్టెంబర్ అయితే కాదు. డిసెంబర్ 10న గేమ్ ఛేంజర్ మూవీని విడుదల చేయబోతున్నారు అంటూ టాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలీదు గానీ.. ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో అసంతృపితో ఉన్నారు.

ఇంక గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో పది రోజుల షెడ్యూల్ జరుగుతోంది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా కన్ఫామ్ చేశాడు. ఆపరేషన్ వాలెంటైన్ ప్రమోషన్స్ లో రామ్ చరణ్ కి కాల్ చేసి గేమ్ ఛేంజర్ అప్ డేట్ అడుగన్నా అని ప్రశ్నించారు. ఆ సమయంలో వరుణ్ చెప్పాడు మార్నింగ్ కూడా మాట్లాడాను. త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు అని చెప్పాడు. ప్రస్తుతం ఒక హై ఇన్ టెన్స్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. ఇది పూర్తైతే సినిమాకి సంబంధించి మేజర్ పార్ట్ పూర్తైనట్లే అని చెబుతున్నారు. మరోవైపు బుచ్చిబాబు కూడా ఎప్పుడెప్పుడు శంకర్ గుమ్మడికాయ కొడతాడా.. ఎప్పుడు ఆర్సీ 16 స్టార్ట్ చేయాలా అని ఎదురుచూస్తున్నాడు. మరి.. గేమ్ ఛేంజర్ డిసెంబర్ లో విడుదల కాబోతోంది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPokerklasPokerklasPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasKulisbet girişmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis