iDreamPost
android-app
ios-app

రామ్‌ చరణ్‌ కారును వెంబడించిన అభిమానులు.. మాములు షాక్‌ ఇవ్వలేదుగా

  • Published Jan 20, 2024 | 9:30 AMUpdated Jan 20, 2024 | 9:31 AM

Fans Follow Ram Charan Car: మెగా పవర్‌ స్టార్‌కి వింత అనుభువం ఎదురయ్యింది. షూటింగ్‌ నుంచి వెళ్తుండగా కొందరు ఆయన కారును ఫాలో అయ్యారు. అప్పుడు ఆయన చేసిన పనికి వారు షాక్‌ అయ్యారు. ఆ వివరాలు..

Fans Follow Ram Charan Car: మెగా పవర్‌ స్టార్‌కి వింత అనుభువం ఎదురయ్యింది. షూటింగ్‌ నుంచి వెళ్తుండగా కొందరు ఆయన కారును ఫాలో అయ్యారు. అప్పుడు ఆయన చేసిన పనికి వారు షాక్‌ అయ్యారు. ఆ వివరాలు..

  • Published Jan 20, 2024 | 9:30 AMUpdated Jan 20, 2024 | 9:31 AM
రామ్‌ చరణ్‌ కారును వెంబడించిన అభిమానులు.. మాములు షాక్‌ ఇవ్వలేదుగా

సినిమా తారలకు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన తారలను కలవడం కోసం ఫ్యాన్స్‌ చేసే ప్రయత్నాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక కొందరైతే పిచ్చి అభిమానంతో దూరాభారం కూడా లెక్క చేయకుండా.. తమ అభిమాన హీరో, హీరోయిన్‌లను కలవడం కోసం ఏకంగా వారు ఉండే ప్రాంతానికి వస్తారు. ఇక తమ అభిమాన తారలు ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే చాలు.. వారితో ఫొటోలు దిగడానికి ప్రయత్నిస్తారు. ఒక్కసారి వారి చేయి పట్టుకుంటే చాలు.. జన్మ ధన్యమైనట్లు ప్రవర్తిస్తారు. అయితే అభిమానులు చేసే పనుల వల్ల కొన్నిసార్లు తారలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. తాజాగా గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు ఇదే అనుభవం ఎదురయ్యింది. ఆయన కారును ఫాలో అయ్యారు అభిమానులు. ఆ వివరాలు..

భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో.. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ నగర శివారులోని ఇస్నాపూర్‌లో జరుగుతోంది. రామ్‌ చరణ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలుసుకున్న చెర్రీ ఫ్యాన్స్‌ .. ఆయన షూటింగ్ ముగించుకుని వచ్చే వరకు ఎదురు చూస్తూ.. ఆ తర్వాత మెగా పవర్‌ స్టార్‌ కారును వెంబడించారు. ఆయనతో పాటు ప్రయాణిస్తూ కొంత దూరం వెంబడించారు. అయితే ఫ్యాన్స్‌ తన కారును ఫాలో అవుతున్న విషయం గమనించిన చెర్రీ.. కొద్ది దూరం వెళ్లాక.. తన కారును ఆపి.. అభిమానులను కలిశారు. వారికి అభివాదం చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఫ్యాన్స్‌ని కోరారు రామ్‌ చరణ్‌.

Fans chasing Ram Charan's car

చెర్రీ చేసిన పనికి అభిమానులు షాక్‌ అయ్యారు. ఆయన ప్లేస్‌లో వేరే ఎవరైనా ఉంటే.. తమకు అందకుండా కారును స్పీడ్‌గా పరిగెత్తించేవారు. కానీ రామ్‌ చరణ్‌ మాత్రం అలా చేయకుండా కారు ఆపి వచ్చి వారిని కలవడం ఫ్యాన్స్‌ని షాక్‌కు గురి చేసింది. చెర్రి చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. కానీ కొందరు మాత్రం.. వారి ప్రైవసీకి ఇలా ఇబ్బంది కలిగించడం కరెక్ట్‌ కాదు అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్‌ల కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిజానికి ఈ సినిమాని ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావించారు. అయితే మధ్యలో శంకర్‌.. ఇండియన్ 2 షూటింగ్‌ని కూడా పూర్తి చేయాల్సి రావడంతోగేమ్‌ చేంజర్‌ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ సినిమాని విడుదల చేయాలని డిసైడ్‌ అయ్యారు.

దాంతో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్రకు అంజలిని హీరోయిన్గా మరొక పాత్రకు కియార అద్వానీ హీరోయిన్ అనే విషయం కొంత క్లారిటీ వచ్చేసింది. కాగా ఈ సినిమా పాన్‌ ఇండయా రేంజ్‌లో విడుదల కానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి