Tirupathi Rao
Ram Charan- Jr NTR Fan war: మరోసారి టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వేదికగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు.
Ram Charan- Jr NTR Fan war: మరోసారి టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వేదికగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు.
Tirupathi Rao
జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ ఇద్దరి మధ్య బాండింగ్ గురించి పాన్ ఇండియా లెవల్ల ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా మెలుగుతూ ఉంటారు. ఇటీవల ఇద్దరూ కలిసి ఒకే కారులో విమానాశ్రయం నుంచి వెల్లడం కూడా చూశాం. కానీ, ఈ ఫ్యాన్స్ మాత్రం వీరికి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి మా హీరో మెయిన్ రోల్ అంటే మా హీరో మెయిన్ రోల్ అంటూ గొడవలు పడ్డారు. విజయేంద్ర ప్రసాద్ తారక్ క్యారెక్టర్ ను అద్భుతంగా పొగిడితే సపోర్టింగ్ రోల్ అంటూ ట్రోల్ చేశారు. ఇప్పుడు మరోసారి తారక్- చరణ్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు.
తాజాగా నెట్టింట వేదికగా జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య మినీ యుద్ధం జరుగుతోంది. అందుకు కారణం ఏంటంటే రామ్ చరణ్- బుచ్చిబాబు ప్రాజెక్ట్ అనే చెప్పాలి. అదేంటి రామ్ చరణ్- బుచ్చిబాబు ప్రాజెక్ట్ అయితే వీళ్లు కొట్టుకోవడం ఏంటని ఆశ్చర్యపోవద్దు. బుచ్చిబాబు చెప్పిన కథ ముందు జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పిన కథ అంటూ కామెంట్స్ వచ్చాయి. ఆ మూవీ టైటిల్ ‘పెద్ది’నే రామ్ చరణ్ మూవీకి పెడుతున్నారని.. అదే ప్రాజెక్ట్ రామ్ చరణ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఈ నెల 20వ తేదీన అధికారికంగా ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం జరగబోతోంది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తారక్- రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య వార్ స్టార్ట్ అయ్యింది.
మా హీరో కథనే మీ వాడు చేస్తున్నాడు అంటూ తారక్ ఫ్యాన్స్ అంటున్నారు. వాటికి కౌంటర్ గా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు చెప్పిన కామెంట్స్ వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో రెండు కథలు వేరు అంటూ బుచ్చిబాబు చెప్పాడు. అసలు విషయం ఏంటి అనేది బుచ్చిబాబుకే తెలియాలి. కానీ, ఫ్యాన్స్ మాత్రం మా హీరో సినిమా మా హీరో సినిమా అంటూ కొట్టేసుకుంటున్నారు. ఇక్కడ కాసేపు పెద్దినే రామ్ చరణ్ మూవీ టైటిల్ అనుకుందాం. దానిని ముందు జూనియర్ ఎన్టీఆర్ విన్న కథే అనుకుందాం. అయితే ఇప్పుడు తప్పేంటి? ఇద్దరు ఫ్యాన్స్ కొట్టుకోవాల్సిన అవసరం అసలు ఏం ఉంది? ఒక స్టార్ హీరో చేయాల్సిన ప్రాజెక్ట్ ను మరో హీరో చేయడం అవి బ్లాక్ బస్టర్ కావడం కొత్తగా జరిగిందేం కాదు.
ఇలా చాలా మంది హీరోలు కథలను వద్దు అనుకున్నారు. ఆ తర్వతా వేరే హీరో దానిని చేయడం అవి హిట్ అవ్వడం కూడా చూశాం. ఇది టాలీవుడ్ లో సర్వ సాధారణంగా జరిగేదే. తారక్ కు వరుస ప్రాజెక్టుల నేపథ్యంలో ఈ కథ చేయడానికి వీలు పడి ఉండదు. అందుక తనకు అత్యంత సన్నిహితుడు, సోదర సమానుడు అయిన రామ్ చరణ్ కు ఆ కథను రికమెండ్ చేసి ఉండచ్చు. తాను కాకపోతే ఆ కథను తన ఫ్రెండ్ చేస్తే బాగుంటుంది అని తారక్ చెప్పి ఉండచ్చు. ఇందులో వారి మధ్య బాండింగ్ కనిపిస్తోంది. కానీ, ఫ్యాన్స్ మార్తం అర్థం లేకుండా యుద్ధాలు చేస్తున్నారు. బుచ్చిబాబు చెప్పినట్లు ఇది వేరే కథ అయినా కూడా పెద్దగా తేడా ఏముంది? ఆ కథ రామ్ చరణ్ కు నచ్చింది చేస్తాను అని చెప్పాడు అయిపోయింది. కాబట్టి ఒక కథను ఎంతమంది హీరోలు అయినా వినచ్చు.. కానీ, ఫైనల్ గా ఎవరు చేస్తారు అనేదే ముఖ్యం.