iDreamPost
android-app
ios-app

కొండా సురేఖ వ్యాఖ్యలపై మండి పడ్డ రకుల్ ప్రీత్ సింగ్

అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు స్పందించారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్ అయ్యారు.

అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు స్పందించారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్ అయ్యారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై మండి పడ్డ రకుల్ ప్రీత్ సింగ్

అక్కినేని కుటుంబం, ప్రముఖ నటి సమంతపై తెలంగాణ మహిళా మంత్రి, మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నాగ చైతన్య, సమంతలు విడిపోవడానికి కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆరే అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొంత మంది నటీమణులు సినిమాలను వదిలేసి వెళ్లిపోయారంటూ కామెంట్స్ చేశారు.  దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఆ వ్యాఖ్యలను ఖండించింది. రాజకీయ లబ్ది కోసం సినీ ప్రముఖులను సంబంధం లేని విషయాల్లోకి లాగొద్దు అంటూ నాగార్జున ఫ్యామిలీ మండిపడుతోంది. సమంత కూడా ఫైర్ అయ్యింది. ఈ నిరాధారమైన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆమె తన వ్యాఖ్యలు వెనక్కు ఉపసంహరించుకుని, క్షమాపణలు చెప్పినప్పటికీ.. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఆమెపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరు ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన గళాన్ని విప్పింది. క్రియేటివిటీకి, ప్రొఫెషనలిజంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఈ అందమైన పరిశ్రమలో నేను జర్నీ చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇప్పటికీ అలాగే ఉంది. ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గపు పుకార్లు మహిళలపై చేయడం బాధాకరం. మరింత నిరుత్సాహ పరిచే విషయం ఏంటంటే.. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరొక మహిళ ఇలాంటి కామెంట్స్ చేయడం. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను ఇందులోకి లాగుతున్నారు. రాజకీయ లబ్డి కోసం నా పేరును వినియోగించడం ఆపాలని నేను కోరుతున్నాను. సినీ సెలబ్రిటీలు రాజకీయాలకు ముడిపెట్టొద్దు’ అంటూ నోట్ పంచుకుంది రకుల్.

Rakul

సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేవలం అక్కినేని ఫ్యామిలీ మాత్రమే కాదు.. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, విజయ్ దేవర కొండ, రవితేజ, సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్, సంయుక్త మీనన్, రామ్ గోపాల్ వర్మ, రోజా, చిన్మయి, ఖుష్బు, సుమ కనకాల,రాజశేఖర్, శ్రీకాంత్ ఓదెల, సందీప్ కిషన్, బన్నీ వాస్, కిరణ్ అబ్బవరం, శైలేష్ కొలను ఇలా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చింది. వ్యక్తిగత విషయాలను మీ రాజకీయాల కోసం వినియోగించుకోవడం సిగ్గు చేటు, బాధాకరం అంటూ ఫైర్ అవుతున్నారు.