iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో హీరోయిన్ రకుల్ కొత్త వ్యాపారం..

  • Published Apr 11, 2024 | 6:20 PM Updated Updated Apr 11, 2024 | 6:20 PM

రకుల్ ప్రీత్ సింగ్ అందంతో పాటు ఫిట్‍నెస్‌కు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం విదితమే. ఇదే కాన్సెప్టుతో వ్యాపారాన్ని స్టార్ చేసింది. మెట్రో నగరాల్లో ఎఫ్ 45 పేరుతో జిమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెడుతోంది.

రకుల్ ప్రీత్ సింగ్ అందంతో పాటు ఫిట్‍నెస్‌కు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం విదితమే. ఇదే కాన్సెప్టుతో వ్యాపారాన్ని స్టార్ చేసింది. మెట్రో నగరాల్లో ఎఫ్ 45 పేరుతో జిమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెడుతోంది.

  • Published Apr 11, 2024 | 6:20 PMUpdated Apr 11, 2024 | 6:20 PM
హైదరాబాద్‌లో హీరోయిన్ రకుల్ కొత్త వ్యాపారం..

జీవితంలో ఎదుర్కొన్న కష్టనష్టాలు.. అదే ఫీల్డ్‌లో ఉన్న సీనియర్స్ అనుభవాలను గుణ పాఠాలుగా మలచుకుని రూపాయి విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు నేటి హీరోయిన్లు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటున్నారు. సినిమా ఆఫర్లు ఉండగానే.. రెమ్యునరేషన్ రూపంలో వచ్చిన డబ్బులతో వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్నారు. రిస్క్ అని తెలిసినా రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అగ్రశ్రేణి హీరోయిన్లంత బిజినెస్ చేస్తున్న సంగతి విదితమే. ఆల్ మోస్ట్ ప్రతి హీరోయిన్‌కి ఏదో ఒక వ్యాపారం, వ్యాపకమో ఉందనే ఉంది. అందులో ఒకరు మోస్ట్ టాలెంటెడ్, బ్యూటీఫుల్ రకుల్ ప్రీత్ సింగ్.

హైదరాబాద్‌లో ఆమెకు ఎఫ్ 45 పేరుతో జిమ్ ఉన్న సంగతి విదితమే. సెలబ్రిటీలంతా ఇక్కడికే వచ్చి కసరత్తులు చేస్తారు. వైజాగ్, ముంబయిలో కూడా ఈ ఫిట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అలాగే వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టింది. అలాగే హెల్త్ అండ్ స్కిన్ రంగంలో కూడా అడుగుపెట్టింది ఈ  బ్యూటీ. 2019లో ‘న్యూబూ‘పేరుతో బయోడీగ్రేడబుల్, రీ యూజబుల్ డైపర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెట్టబోతుంది. ఫుడ్ బిజినెస్ స్టార్ చేసింది. ఇప్పుడు  ఈ వ్యాపాారానికి ఉన్న డిమాండే ఎక్కువ. సో ఇప్పుడు ఈ రంగంపై అమ్మడి కన్ను పడింది. డైన్ రెస్టారెంట్‌ను ప్రారంభించనుంది. మాదాపూర్ ఏరియాలో క్యూర్ ఫుడ్స్‌తో కలిసి రెస్టారెంట్ ఓపెన్ చేయనుంది.

ఏప్రిల్ 16న ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా చిరు ధాన్యాలతో కూడిన వంటకాలే ఇక్కడ ఉండనున్నాయని తెలుస్తోంది. ఆరంభం.. మిల్లెట్లతో అనే ట్యాగ్ లైన్‌తో ఈ క్లౌడ్ కిచెన్ రన్ చేయబోతుంది. డైన్ కాన్సెప్ట్.. మిలెట్స్‌తో రుచికరమైన ఆహారాన్ని అందించడమే ఈ రెస్టారెంట్ ప్రధాన ఉద్దేశం. ఆరోగ్యానికి, ఫిట్‍నెస్‌కు ప్రాధాన్యతనిచ్చే రకుల్.. తన రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లకు కూడా హెల్దీ ఫుడ్ అందించనుంది. ఈ ఏడాది కొత్త జీవితంలో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్..  అయలాన్ చిత్రంతో పలకరించింది. బో తర్వాత ఆమె తెలుగులో కనిపించలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. మేరీ పత్ని కా రీమేక్ అనే హిందీ మూవీతో పాటు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2లో నటిస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio