iDreamPost
android-app
ios-app

Rakshasudu Remake : అక్షయ్ కుమార్ సినిమాకు భారీ డీల్

  • Published Mar 31, 2022 | 2:55 PM Updated Updated Mar 31, 2022 | 2:55 PM
Rakshasudu Remake : అక్షయ్ కుమార్ సినిమాకు భారీ డీల్

అదేంటి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు సినిమా మేం చూశాంగా రీమేక్ కు అంత బడ్జెట్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా. అసలు విషయం వింటే అంతకన్నా పెద్ద షాకే తగులుతుంది. తమిళంలో రట్ససన్ పేరుతో రూపొంది అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యాక తెలుగులో పునఃనిర్మితమైన సంగతి తెలిసిందే. ఇక్కడా మంచి కలెక్షన్లతో భారీ విజయం సొంతం చేసుకుంది. ఇది హిట్ అవ్వడం వల్లే దర్శకుడు రమేష్ వర్మకు రవితేజ ఖిలాడీ ఛాన్స్ వచ్చింది. అంత భారీ బడ్జెట్ ఇచ్చినా దాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు. అది వేరే విషయం. దీనికి సీక్వెల్ తీసే ఆలోచనతో ఆ మధ్య అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు కానీ ఆ తర్వాత ఎలాంటి కదలిక లేదు.

అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడీ మూవీ బాలీవుడ్ లో మిషన్ సిండరెల్లగా రీమేక్ అవుతోంది. అక్షయ్ కుమార్ హీరో.రంజిత్ ఎం తివారి దర్శకుడు.రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తోంది. షూటింగ్ జరుగుతోంది.ఇప్పుడీ సైకో క్రైమ్ థ్రిల్లర్ థియేటర్లలో రావడం లేదు. నేరుగా ఓటిటి రిలీజ్ చేయబోతున్నారు. డిస్నీ హాట్ స్టార్ తో ఆ మేరకు ఒప్పందం కుదిరిందని ముంబై మీడియా టాక్. ఇందుకుగాను అక్షరాలా 135 కోట్ల రూపాయలు హక్కుల రూపంలో నిర్మాతకు ముట్టినట్టు బాలీవుడ్ న్యూస్. ఇది చాలా పెద్ద మొత్తం. ఎందుకంటే క్యాస్టింగ్ రెమ్యునరేషన్లు మినహాయిస్తే ఇది భారీ బడ్జెట్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాదు.మొత్తం సిటీ లొకేషన్ లో అయిపోతుంది.

ఎక్కువ సినిమాలు చేసే ఉద్దేశంతో ఏది పడితే అది ఒప్పుకుంటున్న అక్షయ్ కుమార్ కు ఇటీవలే బచ్చన్ పాండే గట్టి షాక్ ఇచ్చింది.పిచ్చి పిచ్చి మాస్ కథల్లో తనను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడటం లేదని అర్థమైపోయింది. కనీసం డెబ్భై కోట్లు కూడా రాబట్టలేక చతికిలబడింది. అందుకే ప్రాక్టికల్ గా అలోచించి ఇప్పుడీ మిషన్ సిండెరిల్లాను హాట్ స్టార్ కు ఇచ్చేశారు. ఆల్రెడీ మనం చూసేశాం కాబట్టి పెద్దగా ఆసక్తి ఉండదు కానీ ఈ జానర్ ని ఇష్టపడే నార్త్ ఆడియన్స్ దీనికి కనెక్ట్ అవ్వొచ్చు. పెద్దగా మార్పులు చేయకుండా ఒరిజినల్ వెర్షన్ నే ఫాలో అయినట్టు తెలిసింది. ఏప్రిల్ 29న స్ట్రీమింగ్ చేయబోతున్నారు

Also Read : OTT Premiers : ఇంటికొస్తున్న బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet