iDreamPost
android-app
ios-app

Rakesh Master: రాకేష్ మాస్టర్ గా మారిన రామిరెడ్డి.. భార్య- పిల్లలు పూర్తి వివరాలివే!

Rakesh Master: రాకేష్ మాస్టర్ గా మారిన రామిరెడ్డి.. భార్య- పిల్లలు పూర్తి వివరాలివే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాకేష్ మాస్టర్ పేరు తెలియని సినిమా అభిమానులు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్త లేదు. 1500కు పైగా చిత్రాల్లో పని చేసినా కూడా ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేకపోయారు. చివరి క్షణంలో వైద్యానికి కూడా డబ్బులేక ప్రభుత్వాస్పత్రలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే అందరూ ఇప్పుడు చూస్తున్న రాకేష్ మాస్టర్ వేరు అసలు రాకేష్ మాస్టర్ వేరంటూ ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు రాకేష్ మాస్టర్ బ్యాగ్రౌండ్ ఏంటి అంటూ నెట్టింట వెతుకులాట మొదలు పెట్టారు.

రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు అని అందరికీ తెలుసు. అయితే ఆయన అసలు పేరు రామారావు కాదు.. రామిరెడ్డి అని చెబుతున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు జిల్లాలో ఉన్న సమయంలో రాకేష్ మాస్టర్ తండ్ర బాలరెడ్డి ఆయనకు అనుచరుడు. సుందరయ్య ఎలా అయితే తన పేరులోని రెడ్డిని తొలగించుకున్నారో.. బాలిరెడ్డి కూడా తన పేరు, తన కుమారుడి పేరులోని రెడ్డిని తొలగించారు. ఆ విధంగా రామిరెడ్డి కాస్తా రామారావు అయ్యింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక రాకేష్ మాస్టర్ గా మారింది.

చాలామంది రాకేష్ మాస్టర్ స్వస్థలం తిరుపతి అనుకుంటున్నారు. అయితే తిరుపతి మార్కెట్ యార్డులో ఉద్యోగం రావడంతో బాలిరెడ్డి కుటుంబంతో సహా తిరుపతికి మారారు. రాకేష్ మాస్టర్ తిరుపతిలోనే డాన్స్ స్కూల్ పెట్టారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం మద్రాసు వెళ్లిపోయారు. తర్వాత ఎంతో మంది గొప్ప డాన్స్ మాస్టర్ల దగ్గర అసిస్టెంట్ గా చేయడమే కాకుండా.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది గొప్ప కొరియోగ్రాఫర్లకు రాకేష్ మాస్టర్ గురువుగా ఉన్నారు. రాకేష్ మాస్టర్ ప్రేమించిన అమ్మాయినే వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం కూడా. అయితే తర్వాత వాళ్లు విడిపోయారు. ఆమె ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.

తర్వాత రెండో వివాహం కూడా చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో రాకేష్ మాస్టర్ వేరే మహిళతో సహజీవనం కూడా చేశారు. రాకేష్ మాస్టర్ ఎంత మంచి వాడో.. మద్యం తాగతే అంత మూర్ఖంగా ప్రవర్తిస్తారంటూ చెబుతున్నారు. అలా మద్యానికి బానిసై తన కెరీర్ ని మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నారని వాపోతున్నారు. ఎంతో టాలెంట్ ఉన్నా సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అయ్యి ఒక యూట్యూబర్ గా ప్రాణాలు విడిచారు. రాకేష్ మాస్టర్ గురించి తెలుసుకున్న తర్వాత చాలా మంది ఒక మంచి కొరియోగ్రాఫర్ ని మాత్రమే కాకుండా మంచి వ్యక్తిని కోల్పోయాం అంటూ కామెంట్ చేస్తున్నారు.