iDreamPost
android-app
ios-app

Lal Salaam: లాల్‌ సలామ్‌ డే 3 కలెక్షన్స్‌.. రజనీకాంత్‌ కెరీర్‌లోనే అత్యంత దారుణంగా

  • Published Feb 12, 2024 | 12:10 PM Updated Updated Feb 12, 2024 | 12:23 PM

రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో వచ్చిన లాల్‌ సలామ్‌ సినిమా మూడు రోజుల కలెక్షన్స్‌ చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. మరీ ఇంత తక్కువా అంటున్నారు. ఆ వివరాలు..

రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో వచ్చిన లాల్‌ సలామ్‌ సినిమా మూడు రోజుల కలెక్షన్స్‌ చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. మరీ ఇంత తక్కువా అంటున్నారు. ఆ వివరాలు..

  • Published Feb 12, 2024 | 12:10 PMUpdated Feb 12, 2024 | 12:23 PM
Lal Salaam: లాల్‌ సలామ్‌ డే 3 కలెక్షన్స్‌.. రజనీకాంత్‌ కెరీర్‌లోనే అత్యంత దారుణంగా

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్‌ సలామ్‌. ఈ సినిమాకు ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంతే దర్శకురాలు. ఇక ఈ మూవీలో రజనీతోపాటు విష్ణు విశాల్‌, విక్రాంత్‌ కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా మూడు రోజుల క్రితం అనగా ఫిబ్రవరి 9, శుక్రవారం నాడు విడుదలయ్యింది. తెలుగులో కాదు కదా కనీసం తమిళనాట కూడా ఈ సినిమాపై పెద్దగా అంచానాలు కనిపించలేదు. మేకర్స్‌ కూడా ప్రమోషన్స్‌, ఇంటర్వ్యూలు వంటి వాటిపై ఆసక్తి చూపలేదు. ఇక తెలుగులో అయితే రిలీజ్‌ అ‍య్యేంతవరకు.. ఈ మూవీ విడుదల అవుతుందన్న సంగతే ఎవరికి తెలియదు.

ఇలాంటి పరిస్థితుల్లో విడుదలైన లాల్‌ సలామ్‌ సినిమా కలెక్షన్ల విషయంలో కూడా అలానే ఉంది. సుమారు 60 కోట్ల రూపాయలతో ఈ సినిమాను తెరకెక్కిస్తే.. ఇప్పటి వరకు కనీసం బ్రేక్‌ ఈవెన్‌ కూడా సాధించలేదని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్లలో ఈ సినిమా విడుదలయ్యింది. బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే 37 కోట్ల రూపాయలు వసూలు చేయాలి.

lala sallam day 3 collections

అయితే రజనీకాంత్‌ క్రేజ్‌కు భిన్నంగా లాల్‌ సలామ్‌ కలెక్షన్స్‌ ఉన్నాయి. ఈ చిత్రం తొలి రోజున తమిళంలో 3.25 కోట్లు నికరంగా, తెలుగులో 30 లక్షల రూపాయలతో 3.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజు తమిళంలో 3 కోట్ల రూపాయలు, తెలుగులో 25 లక్షల రూపాయల నికర కలెక్షన్లు రాబట్టింది. ఇక మూడవ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. తెలుగులో 28 లక్షలు మాత్రమే రాబట్టి.. 3వ రోజున 3.28 కోట్లు కలెక్ట్‌ చేసింది.

మొత్తంగా మూడు రోజుల్లో లాల్‌ సలామ్‌ సినిమా 11 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు సాధించింది. ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో.. వరల్డ్‌వైడ్‌గా లాల్‌ సలామ్‌ సినిమా కేవలం 15 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్‌ చేసి.. రజనీకాంత్‌ కెరీర్‌లోనే అత్యంత తక్కువ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

జైలర్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత రజనీకాంత్‌ నటించిన లాల్ సలామ్ సినిమాపై పెద్దగా అంచనాలు, బజ్‌ క్రియేట్‌ కాలేదు. ఇక సినిమా కూడా రజనీకాంత్ స్థాయికి తగ్గట్టు లేకపోవడం, అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో ఈ మూవీని ప్రేక్షకులు, సినీ విమర్శకులు నిరాకరించారు. దాంతో లాల్‌ సలామ్‌ సినిమా భారీగా ఓపెనింగ్స్ కూడా సాధించలేకపోయింది.