iDreamPost
android-app
ios-app

సౌత్ లో రజినీ తర్వాత ఆ రికార్డు ప్రభాస్ దేనట!

  • Author ajaykrishna Updated - 03:28 PM, Wed - 23 August 23
  • Author ajaykrishna Updated - 03:28 PM, Wed - 23 August 23
సౌత్ లో రజినీ తర్వాత ఆ రికార్డు ప్రభాస్ దేనట!

బాక్సాఫీస్ వద్ద బిగ్ స్టార్స్ వార్ ఎప్పుడూ ఉంటుంది. ఎవరి రికార్డులు వారు కొల్లగొడుతూ.. నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంటారు. పాన్ ఇండియా స్థాయిలో ఎవరి క్రేజ్ వారు డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడున్న పాన్ ఇండియా స్టార్స్ చేసే సినిమాలన్నీ దాదాపు ఐదు భాషలలో రిలీజ్ అవుతున్నాయి. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళం భాషలలో పాన్ ఇండియా మూవీస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే.. ఎన్ని భాషలలో వచ్చినా.. కలెక్షన్స్ పరంగా సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా అన్నదే పాయింట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఎవరి భాషలో వారి సినిమాలు.. ఆయా హీరోలు రికార్డులు సెట్ చేయడం మామూలే.

ఎప్పుడైతే వేరే భాషలో కూడా అద్భుతమైన కలెక్షన్స్ కొల్లగొట్టి.. అక్కడి హీరోలకే సవాల్ విసురుతారో అది అసలైన సూపర్ హిట్ అని ఫ్యాన్స్ అంటుంటారు. ఈ విషయంలో ఒక భాషకు సంబంధించి.. సౌత్ లో ఇద్దరే ఇద్దరు స్టార్స్ రికార్డు బ్రేక్ చేశారట. అదేంటంటే.. కన్నడ బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు వసూల్ చేసిన హీరోలు ఇద్దరేనట. అందులో మొదట సూపర్ స్టార్ రజినీకాంత్ కాగా.. రెండో హీరో డార్లింగ్ ప్రభాస్. కన్నడ బాక్సాఫీస్ వద్ద కన్నడ హీరోలు కాకుండా.. రూ. 50 కోట్లు వసూల్ చేసింది వీరిద్దరే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కన్నడలో ప్రభాస్ బాహుబలి 2 తో రూ. 60 కోట్ల వరకు వసూల్ చేయగా.. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీ జైలర్ రూ. 60 కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తోంది.

దీంతో దక్షిణాది హీరోలలో ఈ అరుదైన ఫీట్ అందుకున్న హీరోలుగా రజినీ, ప్రభాస్ నిలిచారు. ఈ విషయం తెలిసి అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఇటు డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే.. రజినీ, ప్రభాస్ లకు సంబంధించి మరో న్యూస్ కూడా ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. సౌత్ ఇండియాలో రూ. 500 కోట్ల మైలురాయిని రెండుసార్లు అందుకున్న హీరోల్లో ప్రభాస్ తర్వాత రజినీ నిలవడం విశేషం. ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో.. రజినీ రోబో 2.O సినిమాలతో ఈ ఫీట్ అందుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జైలర్.. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతోంది. మరోవైపు ప్రభాస్ సలార్ సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. మరి వీరి సినిమాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by WAWA ORIGINALS (@wawa_originals)

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet