iDreamPost
android-app
ios-app

ది రాజాసాబ్ రిలీజ్ ట్విస్ట్.. ఆ ప్లేస్ లో !

  • Published Aug 06, 2025 | 10:56 AM Updated Updated Aug 06, 2025 | 10:56 AM

కల్కి తర్వాత ప్రభాస్ సైన్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఆ సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆయా సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేవారు. ఇక ప్రభాస్ నుంచి రిలీజ్ కి రెడీ గా ఉన్న సినిమా రాజాసాబ్

కల్కి తర్వాత ప్రభాస్ సైన్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఆ సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆయా సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేవారు. ఇక ప్రభాస్ నుంచి రిలీజ్ కి రెడీ గా ఉన్న సినిమా రాజాసాబ్

  • Published Aug 06, 2025 | 10:56 AMUpdated Aug 06, 2025 | 10:56 AM
ది రాజాసాబ్ రిలీజ్ ట్విస్ట్.. ఆ ప్లేస్ లో !

కల్కి తర్వాత ప్రభాస్ సైన్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఆ సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆయా సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేవారు. ఇక ప్రభాస్ నుంచి రిలీజ్ కి రెడీ గా ఉన్న సినిమా రాజాసాబ్. అసలు ఈపాటికి ఈ సినిమా రిలీజ్ అయ్యి రికార్డ్స్ గురించి కూడా టాక్ ముగిసిపోవాలి. కానీ అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ చేస్తూనే వస్తున్నారు. దీనితో అభిమానులు కూడా సరే సినిమా వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్లుగానే ఉన్నారు.

ఈ క్రమంలో డిసెంబర్ 5 డేట్ ను లాక్ చేస్తూ బిగ్ అనౌన్సుమెంట్ ఇచ్చారు మేకర్స్. ఆ తర్వాత మధ్యలో ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్స్ వచ్చాయి. కానీ ఏది ఏమైనా డిసెంబర్ డేట్ ను రాజాసాబ్ వదులుకోదని చాలా మంది ఫిక్స్ అయ్యి ఉన్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఓపెన్ అయ్యారు. ఈ సినిమాను జనవరి 9 కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే దీని మీద ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.

ఇక ఇప్పుడు వినిపిస్తున్న మరో వార్త ఏంటంటే. ఎలాగూ సెప్టెంబర్ రేస్ నుంచి అఖండ 2 తప్పుకుంది కాబట్టి. రాజాసాబ్ డేట్ లో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. కానీ దీని గురించి కూడా అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. గతంలో అఖండ మొదటి పార్ట్ డిసెంబర్ మొదటి వారంలోనే రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. సో ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అయ్యి అఖండ 2 ను రిలీజ్ చేసే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.