Somesekhar
Raghava Lawrence: రాఘవా లారెన్స్ తన ఫ్యాన్స్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. బహుశా ఈ డెసిషన్ ఏ హీరో కూడా తీసుకోలేడేమో? మరి ఆ నిర్ణయం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..
Raghava Lawrence: రాఘవా లారెన్స్ తన ఫ్యాన్స్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. బహుశా ఈ డెసిషన్ ఏ హీరో కూడా తీసుకోలేడేమో? మరి ఆ నిర్ణయం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
రాఘవ లారెన్స్.. స్టార్ కొరియోగ్రాఫర్ గా, హీరోగా, డైరెక్టర్ గా తనకంటూ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సేవాగుణంలో లారెన్స్ ది ఎంత పెద్ద మనసో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా పేద ప్రజలకు తనవంతు సాయం చేస్తూ వస్తున్నాడు లారెన్స్. ఇక తన అభిమానులకు ఏ చిన్న కష్టం వచ్చినా.. వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతాడు. అయితే ఈసారి తన ఫ్యాన్స్ కోసం ఏ హీరో కూడా తీసుకోని నిర్ణయం తీసుకున్నాడు. మరి ఆ డెసిషన్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
తనను కలిసేందుకు వచ్చిన ఓ అభిమాని రోడ్డు ప్రమాదంలో మరణించడంతో.. ఆవేదన చెందాడు రాఘవా లారెన్స్. ఈ ఘటనతో కీలక నిర్ణయం తీసుకున్నాడు లారెన్స్. తనను కలిసేందుకు అభిమానులు ఎవరూ రావొద్దని.. తానే స్వయంగా వస్తానని చెప్పాడు. దానికి కారణం ఏంటంటే? గత సంవత్సరం చెన్నైలో నిర్వహించిన సెల్పీ కార్యక్రమానికి వచ్చిన ఓ ఫ్యాన్ తిరిగి వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనతో తీవ్ర కలతచెందిన లారెన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఫ్యాన్స్ ఎవ్వరూ తనను కలవడానికి రావొద్దని, నేనే మీ ఇంటికి వస్తానని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
“నా ఫ్యాన్స్ అందరికి హాయ్. గతేడాది చెన్నై లో ఫ్యాన్స్ మీట్ లో జరిగిన సంఘటన నన్ను ఎంతగానో బాధకు గురిచేసింది. దీంతో నేను ఓ డెసిషన్ తీసుకున్నాను. నా ఫ్యాన్స్ ఎవరూ కూడా నా కోసం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ఇక నుంచి నేనే మీ దగ్గరికి వస్తాను. మీ పట్టణంలో ఫొటో షూట్ ఏర్పాటు చేస్తాం. ఫిబ్రవరి 25 నుంచి ఈ ప్రొగ్రామ్ ను ప్రారంభిస్తున్నాను. రేపు విల్లుపురంలో లక్ష్మి మహల్ వద్ద కలుద్దాం” అంటూ ట్వీట్ చేశాడు రాఘవా లారెన్స్. దీంతో అభిమానుల పట్ల లారెన్స్ కు ఉన్న ప్రేమను చూసి.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీది ఎంత గొప్ప మనసు, బహుశా ఇలాంటి నిర్ణయాలు ఏ హీరో కూడా తీసుకోలేడేమో? అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోసం లారెన్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Hi friends and fans, Last time during a fans meet photoshoot in Chennai, One of my fan met with an accident and lost his life. It was so heartbreaking. On that day, I decided that my fans shouldn’t travel for me but I will travel for them and organize a photoshoot in their town.… pic.twitter.com/lIdnJuKbhX
— Raghava Lawrence (@offl_Lawrence) February 24, 2024
ఇదికూడా చదవండి: చనిపోయాక బతకొచ్చా? OTTలో ఈ సైన్స్ ఫిక్షన్ అస్సలు మిస్ కావొద్దు!