iDreamPost

చనిపోయాక బతకొచ్చా? OTTలో ఈ సైన్స్ ఫిక్షన్ అస్సలు మిస్ కావొద్దు!

Best Science Fiction OTT Suggestions: సైన్స్ ఫిక్షన్ లో చాలానే సినిమాలు, సిరీస్లు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. కానీ, ఈ సిరీస్ మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి.

Best Science Fiction OTT Suggestions: సైన్స్ ఫిక్షన్ లో చాలానే సినిమాలు, సిరీస్లు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. కానీ, ఈ సిరీస్ మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి.

చనిపోయాక బతకొచ్చా? OTTలో ఈ సైన్స్ ఫిక్షన్ అస్సలు మిస్ కావొద్దు!

వెబ్ సిరీస్ లు చూసే వారికి ఒక వీక్ నెస్ ఉంటుంది. ఒక మంచి సిరీస్ ని స్టార్ట్ చేస్తే అది పూర్తయ్యే వరకు ఆపలేరు. అయితే అంత బాగా ఎంగేజ్ చేయాలి అంటే కచ్చితంగా ఆ సిరీస్ లో విషయం ఉండాలి. ఇప్పుడు అలాంటి ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్ ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ సిరీస్ లో మీరు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా బతకచ్చా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటారు. సమాధానం కాదు.. ఎలా బతకొచ్చో ఒక ఐడియా వస్తుంది. నిజానికి అది నిజంగా నిజమైతే బాగుండు అనే భావన కూడా వస్తుంది. మరి.. ఆ సిరీస్ ఏది? అసలు దాని కథేంటో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటోంది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అప్ లోడ్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ గురించి. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ వెబ్ సిరీస్ మొత్తం 16 భాషలు, 53 సబ్ టైటిల్స్ తో అందుబాటోలు ఉంది. 2020లో ఈ అప్ లోడ్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో మొత్తం మూడు సీజన్లు ఉన్నాయి. తొలి సీజన్లో 10 ఎపిసోడ్లు, రెండో సీజన్లో 7 ఎపిసోడ్లు, మూడో సీజన్లో 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల వరకు ఉంటుంది.

ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామా సిరీస్. ఇందులో మంచి ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అసలు ఈ కాన్సెప్టే ఎంతో కొత్తగా ఉంటుంది. సిరీస్ లైన్, టేకింగ్ అంతా చాలా ఫ్రెష్ గా, రిచ్ గా ఉంటుంది. అలాగే ఫన్, లవ్, రొమాన్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ సిరీస్ కి ఏ రేటింగ్ ఇచ్చారు. మీ దగ్గర డబ్బుంటే మీరు చనిపోయిన తర్వాత జీవితాన్ని ఎంత లగ్జీరియస్ గా గడపొచ్చో, ఎన్ని సౌకర్యాలు అనుభవించొచ్చే ఈ వెబ్ సిరీస్ లో చూడచ్చు. ఇది నిజానికి వాస్తవానికి చాలా దూరంగా ఉంటుందే గానీ.. అలా జరిగితే భలే ఉంటుంది కదా అనే భావన మాత్రం కలిగిస్తుంది.

కథ ఏంటంటే?:

నాథన్ బ్రౌన్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. అతడిని ఇంగ్రిడ్(అలెగ్ర ఎడ్వర్డ్స్) అనే ధనవంతుల కుటుంబంలో పుట్టిన అమ్మాయి ప్రేమిస్తుంది. ఆ తర్వాత నాథన్ ప్రేమించాల్సి వస్తుంది. ఎన్నిసార్లు ఆమెకు బ్రేకప్ చెప్పాలి అనుకున్నా అతని కుటుంబం కోసం ఆ పని చేయలేడు. ఒకరోజు నాథన్ కు ఘోర ప్రమాదం జరుగుతుంది. అతను బతకడు అని వైద్యులు తేల్చేస్తారు. ఇంగ్రిడ్.. నాథన్ ను అప్ లోడ్ చేయాలి అని ఫిక్స్ అవుతుంది. అంటే అతని జ్ఞాపకాలను డిజిటలైజ్ చేసేస్తారు. అక్కడ ఒక రిసార్ట్ ఉంటుంది. వారు ఖర్చు పెట్టే స్థోమతను బట్టి తమకు నచ్చిన రూమ్, నచ్చిన సౌకర్యాలను అక్కడ పొందచ్చు.

ఆ రిసార్ట్ లో అప్ లోడ్స్ కి అందించే ప్రతి సౌకర్యానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అక్కడ ఉండే అప్ లోడ్స్ కి సహాయకులుగా కొందరు ఉంటారు. వారిని ఏంజెల్స్ అంటారు. హీరోకి నోరా ఆంటోనీ(అండి అల్లో) అనే ఏంజెల్ ను కేటాయిస్తారు. ఆ తర్వాత వారి మధ్య స్నేహం, ప్రేమ మొదలవుతాయి. అలాగే నోరాతో పరిచయం తర్వాతే నాథన్ కు తన లైఫ్ కి ఒక పర్పస్ లభిస్తుంది. అసలు నాథన్- ఇంగ్రిడ్ ప్రేమ ఏమవుతుంది? నోరాతో నాథన్ ప్రేమను కొనసాగించ గలుగుతాడా? అసలు ఈ అప్ లోడ్ అనేది ఎంత వరకు ఉపయోగం? ఇలాంటి చాలానే ప్రశ్నలు మీ మదిలో మెదులుతాయి. వాటికి సమాధానం తెలుసుకోవాలి అంటే మీరు అమెజాన్ ప్రైమ్ లో ఉండే అప్ లోడ్ అనే సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామాని చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి