iDreamPost
android-app
ios-app

రాడిసన్ డ్రగ్ కేసు.. హీరోయిన్ కుషిత కల్లపు చెల్లిపై కేసు నమోదు

  • Published Feb 27, 2024 | 11:37 AM Updated Updated Feb 27, 2024 | 2:50 PM

గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో జరిపిన డ్రగ్స్ రైడింగ్‌లో ఓ తెలుగు హీరోయిన్ చెల్లెలు పట్టుబడింది. ఆమె పట్టుబడటం ఇది తొలిసారి కాదూ.. గతంలోనూ అదే హోటల్లో పబ్ మీద రైడింగ్ చేసిననప్పుడు కూడా దొరికేసింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో జరిపిన డ్రగ్స్ రైడింగ్‌లో ఓ తెలుగు హీరోయిన్ చెల్లెలు పట్టుబడింది. ఆమె పట్టుబడటం ఇది తొలిసారి కాదూ.. గతంలోనూ అదే హోటల్లో పబ్ మీద రైడింగ్ చేసిననప్పుడు కూడా దొరికేసింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Feb 27, 2024 | 11:37 AMUpdated Feb 27, 2024 | 2:50 PM
రాడిసన్ డ్రగ్ కేసు.. హీరోయిన్ కుషిత కల్లపు చెల్లిపై కేసు నమోదు

హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్ కలకలం రేపుతోంది. నార్కోటిక్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. డ్రగ్స్ ఎక్కడో ఓ చోట దొరుకుతూనే ఉన్నాయి. ఇందులో సెలబ్రిటీలు ఉండటం ఆందోళన కలిగించే అంశం. తాజాగా గబ్బిబౌలిలోని రాడిసన్ హోటల్లో జరిగిన దాడుల్లో శేరిలింగపల్లి బీజెపీ నేత కుమారుడు పట్టుబడ్డారు. పోలీసులు చేపట్టిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఈ డ్రగ్స్ రైడింగ్‌లో ఓ తెలుగు హీరోయిన్ చెల్లెలు పట్టుబడడం హాట్ టాపిక్ అవుతుంది. ఆమె హీరోయిన్ ఎవరో కాదూ.. కుషిత కల్లపు. ఇప్పుడు ఆమె చెల్లెలు లిషి గణేష్ కల్లపు దొరికింది. వీరిద్దరూ యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయ్యారు. గతంలో ఇదే రాడిసన్ బ్లూ హోటల్లో ఉన్న పుడింగ్ పబ్ మీద రైడింగ్ చేసినప్పుడు పట్టుబడ్డారు అక్కా చెల్లెళ్లు.. కుషిత కల్లపు,లిషి గణేష్ కల్లపు.

అయితే అప్పట్లో పబ్ కెళ్లి బజ్జీలు తినేసి వచ్చామంటూ కుషిత పలు మీడియా సంస్థలకు వెళ్లడించింది. అప్పటి నుండి ఆమెను బజ్జీ పాప అంటూ  ట్రోల్ చేశారు. కాగా, కుషిత పలు సినిమాల్లో నటించింది. నీతో నేను అనే సినిమాలో నటించింది ఈ అమ్మడు. గుంటూరు కారంలో కూడా యాక్ట్ చేయగా.. ఎడిటింగ్‌లో ఆమె పాత్ర ఎగిరిపోయింది. ప్రస్తుతం బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరోగా నటించిన ’బాబు నంబర్ వన్ బుల్ షిట్ గాయ్‘ అనే చిత్రంలో కుషిత హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు కుషిత సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా కూడా  ఓ రిపోర్టర్ గతంలో పబ్ రైడింగ్ గురించి ఇన్ డైరెక్టుగా క్వశ్చన్ అడగ్గా.. అప్పట్లో తాను నిజమే చెప్పానంటూ పేర్కొంది.

అంతలోనే ఆమె చెల్లి లిషి గణేష్ కల్లపు.. తాజా రైడ్స్‌లో దొరికిపోయింది. మరోసారి ఆమె పట్టుబడటం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. చెల్లెలు పట్టుబడటంతో కుషిత ఇప్పుడు ఏం కహానీలు చెబుతుందో వెయిట్ చేయాలి. చెల్లెలు కూడా ఏదైనా తినడానికి వెళ్లిందని సమాధానమిస్తదేమో చూడాలి మరీ. పైకేమో తామేమీ ఎరగమని, తాము ఏ తప్పు చేయలేదని, డ్రగ్స్ ఎలా ఉంటాయో తెలియదంటూ నీతులు చెప్పిన అమ్మడు.. ఇప్పుడు ఏం సమాధానమిస్తుందో.. మొత్తానికి ఈ కేసులో 10 మంది వీఐపీలు ఉన్నట్లు తెలిసింది. వారిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారిలో ఒకరు లిషి కల్లపు. డ్రగ్స్ పార్టీలో కొకైని వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş