iDreamPost
android-app
ios-app

Radhe Shyam : వాళ్ళను మెప్పిస్తే చాలు బాక్సాఫీస్ ఊచకోతే

  • Published Mar 08, 2022 | 3:03 PM Updated Updated Dec 15, 2023 | 6:15 PM

ఒక్క హైదరాబాద్ లోనే మొదటి రోజు సుమారు 3 కోట్ల గ్రాస్ ఆన్ లైన్ ద్వారానే వచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఇంకా జోడించాల్సిన స్క్రీన్లు షోలు చాలా ఉన్నాయి కాబట్టి ఫైనల్ ఫిగర్ లో భారీ మార్పు ఖాయం. అక్కడే కాదు ప్రతి చోటా ఇదే పరిస్థితి ఉంది. రెండో ట్రైలర్ వచ్చాక అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి.

ఒక్క హైదరాబాద్ లోనే మొదటి రోజు సుమారు 3 కోట్ల గ్రాస్ ఆన్ లైన్ ద్వారానే వచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఇంకా జోడించాల్సిన స్క్రీన్లు షోలు చాలా ఉన్నాయి కాబట్టి ఫైనల్ ఫిగర్ లో భారీ మార్పు ఖాయం. అక్కడే కాదు ప్రతి చోటా ఇదే పరిస్థితి ఉంది. రెండో ట్రైలర్ వచ్చాక అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి.

Radhe Shyam : వాళ్ళను మెప్పిస్తే చాలు బాక్సాఫీస్ ఊచకోతే

ఇంకో మూడు రోజుల్లో రాధే శ్యామ్ సందడి మొదలుకానుంది. అడ్వాన్ బుకింగ్స్ మంచి జోరుమీదున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే మొదటి రోజు సుమారు 3 కోట్ల గ్రాస్ ఆన్ లైన్ ద్వారానే వచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఇంకా జోడించాల్సిన స్క్రీన్లు షోలు చాలా ఉన్నాయి కాబట్టి ఫైనల్ ఫిగర్ లో భారీ మార్పు ఖాయం. అక్కడే కాదు ప్రతి చోటా ఇదే పరిస్థితి ఉంది. రెండో ట్రైలర్ వచ్చాక అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. బెనిఫిట్ షోకు రెండు నుంచి మూడు వేల దాకా టికెట్ ధర పలుకుతోందట. అంత మొత్తమైనా కొనేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ సిద్ధపడుతున్నారు. బాహుబలి, సాహోల తర్వాత వచ్చిన గ్యాప్ అలాంటిది. దేనికైనా రెడీ అనేస్తున్నారు.

విజువల్ గ్రాండియర్ గా వస్తున్న రాధే శ్యామ్ కు అంతా అనుకూలంగానే కనిపిస్తోంది కానీ ఒక్క విషయంలో మాత్రం అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇది యూరోప్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ లవ్ స్టోరీ. ప్రత్యేకంగా విలన్లంటూ ఎవరూ ఉండరు. పరిస్థితులే ప్రతినాయకులుగా ఉంటాయి. ముఖ్యంగా విధి ఆడే ఆటలో పోరాడే ప్రేమజంట కథ ఇది. మరి ఎంత వరకు మాస్ కు ఎక్కుతుందనేది వసూళ్లను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే సాఫ్ట్ లవ్ స్టోరీస్ కి వందల కోట్ల రీచ్ ఉండదు. కానీ ఇక్కడ ఉన్నది ప్రభాస్. ఆ కటవుట్ కే జనం ఎగబడతారు. అయినా కూడా కంటెంట్ చాలా కీలకమని సాహో ఫలితం ఋజువు చేసింది.

ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు 10 సాయంత్రం లేదా రాత్రి పూట వేయాలనుకున్న పెయిడ్ ప్రీమియర్స్ ని యువి వద్దనుకున్నట్టు టాక్. దీని వల్ల సోషల్ మీడియాలో కథా కథనాల గురించి ప్రచారం జరిగిపోయి 11న చూసే వాళ్ళ ఎగ్జైట్మెంట్ మీద ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయంతో డ్రాప్ అయినట్టుగా చెబుతున్నారు. ఏమైనా అనూహ్య నిర్ణయం ఉంటే తప్ప రాధే శ్యామ్ ఫస్ట్ షో పడేది తెల్లవారుఝామున నాలుగు తర్వాతే. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ లవ్ థ్రిల్లర్ కు జస్టిన్ ప్రభాకరన్ పాటలు సమకూర్చగా నేపధ్య సంగీతం తమన్ అందించడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సెన్సార్ రిపోర్ట్ మాత్రం సూపర్ పాజిటివ్ ఉంది

Also Read : RRR : 17 రోజుల ముందుగానే వసూళ్ల హంగామా