iDreamPost
iDreamPost
తొలి మూడు రోజులు వసూళ్ల గురించి ఎంత ఘనంగా చెప్పుకున్నా ఫైనల్ గా రాధే శ్యామ్ బిగ్ డిజాస్టర్ గా నిలిచిపోవడం ఖాయమైపోయింది. సుమారు 110 కోట్ల థియేట్రికల్ లాస్ తో నిర్మాతలను డిస్ట్రిబ్యూటర్లను గట్టి దెబ్బ కొట్టింది. ఓన్ రిలీజ్ కాబట్టి ఈ నష్టంలో అధిక శాతం యువి భుజాల మీదే పడుతుందని టాక్. ఒకవేళ నెక్స్ట్ ప్రాజెక్టు తో రికవరీ చేద్దామన్నా ఇప్పటికిప్పుడు ఇంత గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ప్యాన్ ఇండియా సినిమా ఏదీ తన వద్ద లేదు. అన్నీ మీడియం రేంజ్ వే సెట్స్ మీదున్నాయి. ప్రభాస్ కూడా వేరే బ్యానర్లు సంస్థలకు కమిట్ మెంట్ ఇచ్చి బిజీగా ఉన్నాడు. సో దగ్గరలో వీళ్లకు చేసే సూచనలు చాలా తక్కువగా ఉన్నాయి.
కేవలం హంగులకు గ్రాఫిక్స్ కు కాసులు రాలవని రాధే శ్యామ్ చాలా ఖరీదైన పాఠం నేర్పించింది. గతంలో చిరంజీవి అంజి, నాగార్జున డమరుకం లాంటివి కూడా ఇదే తరహాలో దర్శకులకు ఒక హెచ్చరికలా పని చేశాయి. కానీ చరిత్ర ఎంత మొత్తుకుని చెప్పినా వినే వాళ్ళు తక్కువ. మనం పొయెటిక్ గా తీశామని గర్వంగా చెప్పుకోవడం కాదు సామాన్య జనానికి అది రీచ్ అయ్యేలా ఉందా లేదా అనేదే స్క్రిప్ట్ దశలో చెక్ చేసుకోవాల్సిన కీలక అంశం. అంతే తప్ప హీరో ఇమేజ్ ఉంది కదాని ఏది పడితే అది తీస్తే ఆదరించేందుకు జనం సిద్ధంగా లేరు. పైగా ఓటిటి రూపంలో ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు ఖరీదైన వ్యవహారంగా మారిన థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని గుడ్డిగా కొనేయరు.
దీని ప్రభావం సలార్, ఆది పురుష్ ల మీద ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ బిజినెస్ లెక్కల్లో మాత్రం ఎంతో కొంత తేడాలు వచ్చేస్తాయి. బాహుబలి తర్వాత వచ్చిన మార్కెట్ ని అతిగా అంచనా వేసుకుని కథా కథనాలు మీద శ్రద్ధ పెట్టకుండా కేవలం మార్కెటింగ్ మీదే దృష్టి సారిస్తున్న నిర్మాణ సంస్థలకు రాధే శ్యామ్ ఒక కేస్ స్టడీ లాంటిది. రాజమౌళి ముందు సినిమా పూర్తి చేశాక దాన్ని ఎలా ప్రమోట్ చేయాలా అని ఆలోచిస్తాడు. అంతే తప్ప ఎలా తీసినా అమ్ముకోవచ్చనే సూత్రం ఎప్పుడూ పాటించలేదు. ఇకనైనా తమ డార్లింగ్ స్క్రిప్ట్ ల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని అభిమానులు కోరుతున్నారు. మారుతీ తీయబోయే ఎంటర్ టైనర్ లో పాత ప్రభాస్ ని చూస్తామేమో
Also Read : The Kashmir Files : వసూళ్ల సునామి సృష్టిస్తున్న వివాదాస్పద సినిమా